డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంలో.. ‘భారీ కుట్ర’

Published: Wednesday September 02, 2020

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో అనస్తీషియా నిపుణుడిగా పనిచేసిన డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వెల్లడించింది. ఇందులో భారీ కుట్రకోణంలోని భాగాన్ని దర్యాప్తు చేస్తున్నందున మరికొంత గడువు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించింది. à°ˆ కేసులో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, వందమందికి పైగా సాక్షుల్ని విచారించామని సీబీఐ తరఫు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.చెన్నకేశవులు నివేదించారు.

 

అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. à°ˆ వ్యవహారంపై దర్యాప్తు పూర్తిచేసి నవంబరు 11లోపు తదుపరి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణను అదేనెల 16కు వాయిదా వేస్తూ జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

 

మధ్యంతర నివేదిక పరిశీలన..

డాక్టర్‌ సుధాకర్‌ పట్ల విశాఖ పోలీసులు అమానుషంగా వ్యవహరించారంటూ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. అమికస్‌ క్యూరీగా సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డిని నియమించడంతో పాటు ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకుంది. à°ˆ వ్యవహారంలో ఏదైనా కుట్ర ఉందేమో తేల్చాలని.. దర్యాప్తు చేపట్టి 8వారాల్లోగా మధ్యంతర నివేదిక అందించాలని మే 22à°¨ సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే.

 

à°ˆ నేపథ్యంలో ధర్మాసనం ముందు మంగళవారం మరోమారు విచారణ జరిగింది. à°ˆ సందర్భంగా సీబీఐ తరఫు పీపీ చెన్నకేశవులు వాదనలు వినిపించారు. à°ˆ కేసుకు సంబంధించి సీల్డ్‌ కవర్‌లో జూలై 10à°¨ మధ్యంతర నివేదిక దాఖలు చేశామన్నారు. à°† నివేదికను ధర్మాసనం పరిశీలించి.. ‘అప్పట్లో మరో 12వారాలు సమయం అడిగారా’ అని ప్రశ్నించిం ది. పీపీ బదులిస్తూ.. భారీ కుట్ర ఉందేమోనన్న కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోందని, అందువల్ల మరో 2నెలల సమయం కావాలని కోరారు. కొవిడ్‌ కారణంగా సీబీఐ దర్యాప్తును కోర్టు విధించిన గడువులోగా పూర్తి చేయలేకపోయిందని, మరికొంత సమయం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.