తహసీల్‌ ఎదుట రైతు కుటుంబం ఆందోళన

Published: Friday September 04, 2020

తన పెద్దకుమారుడు ఆస్తి మొత్తాన్ని అక్రమంగా రాయించుకున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ à°† తండ్రి.. తన భార్య, మరో ఇద్దరు కుమారులు, కోడళ్లతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. పురుగు మందు డబ్బాలు పట్టుకుని.. తనకు న్యాయం చేయకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని భీష్మించుకు కూర్చున్నారు. à°ˆ ఘటన భూపాలపల్లిలోని మండల తహసీల్‌ కార్యాలయం ఎదుట గురువారం జరిగింది. గొర్లవీడుకు చెందిన మామిడి వెంకులుకు 30 ఎకరాల భూమి ఉంది. దీనిని తన ముగ్గురు కుమారులకు సమానంగా పంచి ఇచ్చాడు. అయితే, పెద్ద కుమారుడుఓ ప్రజాప్రతినిధితో కలిసి రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టజెప్పి మొత్తం భూమిని తన పేరున పట్టా రాయించుకున్నాడని వెంకులు ఆవేదన వ్యక్తం చేశాడు. à°ˆ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో భార్య, ఇద్దరు కుమారులు, వారి భార్యా పిల్లలతో కలిసి పురుగుల మందు డబ్బాలతో తహసీల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. న్యాయం జరిగేంత వరకు కదిలే ప్రసక్తి లేదని, లేదంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని భీష్మించుకు కూర్చున్నారు. దీనిపై తహసీల్దార్‌ అశోక్‌ స్పందిస్తూ శుక్రవారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో సమావేశం నిర్వహించి మోకా మీద ఎవరున్నారో పరిశీలిస్తామని, ఎవరికి à°Žà°‚à°¤ భూమి ఉందో చెబితే అక్కడే రాయించి ఇస్తామని చెప్పారు.