80 రైళ్లకు భారతీయ రైల్వే గ్రీన్‌సిగ్నల్..

Published: Saturday September 05, 2020

 à°­à°¾à°°à°¤à±€à°¯ రైల్వే సెప్టెంబర్ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లు నడపనుంది. సెప్టెంబర్ 10 నుంచి రిజర్వేషన్ మొదలవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న 230 రైళ్లకు అదనంగా à°ˆ 80 ప్రత్యేక రైళ్లు వచ్చి చేరుతాయని  రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ శనివారంనాడు తెలిపారు. వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్ల కోసం అదేమార్గంలో సమాంతర రైళ్లు (క్లోన్ ట్రైన్స్) నడుపుతామని కూడా ఆయన వెల్లడించారు.

 

'ఏదైనా రైలుకు డిమాండ్ ఎక్కువై, వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్లోన్ రైళ్లను à°† వెనుకనే నడుపుతాం. అందువల్ల ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యం లేకుండా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు' అని వీకే యాదవ్ తెలిపారు. పరీక్షలు, ఇదే తరహా కారణాలతో రాష్ట్రాల నుంచి డిమాండ్ వచ్చినప్పుడల్లా రైళ్లను అందుబాటులో ఉంచుతామన్నారు. బుల్లెట్ ట్రైన్స్‌పై à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నకు స్పందిస్తూ, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పురోగతి దశలో ఉందన్నారు. భూముల సేకరణ నిర్ధారణ అయిన తర్వాత ట్రైమ్ ఫ్రేమ్‌లో పని జరుగుతుందన్నారు. గుజరాత్ నుంచి 82 శాతం, మహారాష్ట్ర నుంచి 23 శాతం భూసేకరణ ఉంటుందన్నారు.