చంద్రబాబుకు తప్పిన ప్రమాదం

Published: Saturday September 05, 2020

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రమాదం తృటిలో తప్పింది. కొద్దిసేపటి క్రితం కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం జరిగింది. ఆవు అడ్డురావడంతో ఎస్కార్ట్‌ వాహనం డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశారు. దీంతో కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక్కసారిగా కాన్వాయ్‌లోని ముందు ఉన్న ఎస్కార్ట్ వాహనాన్ని ఢీ కొట్టింది. à°† తర్వాతి వాహనంలోనే చంద్రబాబు ఉన్నారు. బాబు క్షేమంగానే ఉన్నారు. à°ˆ ఘటనలో వాహనం ముందు భాగం దెబ్బతిన్నది. స్వల్పగాయాలతో మరో వాహనంలో భద్రతా సిబ్బంది వెళ్లింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా à°ˆ ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం దగ్గర ఘటన జరిగింది.

 

కాగా.. à°ªà±†à°¦à±à°¦ ప్రమాదమేమీ జరగకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. à°ˆ ఘటన అనంతరం మళ్లీ యథావిధిగా కాన్వాయ్‌ హైదరాబాద్‌కు పయనమైనట్లు తెలియవచ్చింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.