అంతర్వేది ఘటనలో అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారు

Published: Wednesday September 09, 2020

అంతర్వేది ఘటనలో అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు ఆక్షేపించారు. ఆలయాల్లో వరుస ఘటనల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని తప్పుబట్టారు. అంతర్వేదిలో రథం దగ్ధమైన ప్రాంతాన్ని వీర్రాజు పరిశీలించారు. పోలీసుల ఆంక్షలతో పరిమిత సంఖ్యలో నేతలకు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన..చాలా దారుణమైన ఘటన అని చెప్పారు. అంతర్వేది ఘటన పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. బీజేపీ, జనసేన శ్రేణులు తమ ఇళ్లలో లక్ష్మీనర్సింహస్వామి విగ్రహాలు పెట్టి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. 11న ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట నిరసనలు తెలపాలని సోము వీర్రాజు కోరారు.

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ప్రఖ్యాత శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి చెందిన రథం కాలిబూడిదైన విషయం తెలిసిందే. లక్ష్మీనరసింహస్వామివారి తీర్థ మహోత్సవం రోజున ఏటా రథోత్సవం జరుగుతుంటుంది. అప్పట్లోనే రూ.94 లక్షల ఖర్చుతో పూర్తి టేకు కలపతో కనులు మిరుమిట్టు గొలిపే రీతిలో తయారైన à°ˆ రథాన్ని  57 ఏళ్ల నుంచి ఉత్సవాలకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆలయానికి సమీపంలోని ప్రత్యేక షెడ్డులో దీనిని భద్రపరిచారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.45 à°—à°‚à°Ÿà°² సమయంలో à°† షెడ్డులో మంటలు రేగాయి. గమనించిన భక్తులు కేకలు వేయడంతో స్థానికులు, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.