ఒకే షెడ్యూల్లో 4 పోటీ పరీక్షలు

Published: Thursday September 10, 2020

ఒకే షెడ్యూల్లో 4 పోటీ పరీక్షలు జరగనున్నాయి. à°ˆ నెల 21 నుంచి 23 వరకు గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ మెయిన్స్‌, 25 నుంచి 27 వరకు నాన్‌  గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ పరీక్షలను ఏపీపీస్సీ నిర్వహించనుంది. à°ˆ నెల 21 నుంచి 25 వరకు యూజీసీ నెట్‌, à°ˆ నెల 20 నుంచి 26 వరకు గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతోంది.

 

అన్ని పరీక్షలు ఒకే తేదీల్లో నిర్వహించడం వల్ల అభ్యర్థులు నష్టపోయే అవకాశముందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి నిరుద్యోగులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

 

ఇదిలావుంటే, ఒకేరోజు రెండు, మూడు పరీక్షలు లేకుండా చూడాలని, ఏపీపీఎస్సీ ఇయర్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని, డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమంత్‌ కుమార్‌ à°’à°• ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలన్నారు.