ఆ రాష్ట్రంలో నర్సులు కనిపిస్తే వణికిపోతున్నారట

Published: Saturday May 26, 2018

చావు భయం తప్పు కాదు. కానీ.. ప్రాణాల మీదకు వస్తుందన్న అనుమానంతో మానవత్వాన్ని మరిచిపోయి వ్యవహరించటమే దుర్మార్గంగా చెప్పాలి. తాజాగా కేరళలో అలాంటి పరిస్థితే నెలకొంది. నిఫా గుబులు.. కేరళ ప్రజానీకాన్ని వణికిస్తోంది. అక్కడి ప్రజలు ఇప్పుడు నర్సులు కనిపిస్తే చాలు.. ఆమడ దూరానికి పరుగులు తీయటమే కాదు.. వారి పట్ల సామాజిక వెలిని ప్రదర్శిస్తున్న వైనం ఇప్పుడు ఆందోళన కలిగించేలా చేస్తోంది.

నివారణకు మందు లేని నిఫా వైరస్ కారణంగా కేరళలో ఇప్పటివరకూ 12 మంది మృతి చెందటం తెలిసిందే. మృతుల్లో ఒకరు నర్సు కూడా ఉన్నారు. వైరస్ బారిన పడినోళ్లకు చికిత్స చేసిన పాపానికి ఒక నర్సు తన ప్రాణాల్ని కోల్పోయింది. విధి నిర్వహణలో చావు భయం లేకుండా పని చేసినందుకు ఆమె అమరులయ్యారు.

అయితే.. à°ˆ ఉదంతం కేరళీయుల్లో నర్సుల పట్ల సానుకూలత పెరగాల్సింది పోయి.. ప్రతికూలత పెరగటం.. నర్సులంటేనే ఆమడ దూరానికి పరుగులు తీస్తున్న వైనం షాకింగ్ à°—à°¾ మారింది. 

నిఫా వైరస్ నర్సుల ద్వారా తమకు అంటుతుందన్న భయాందోళనలతో విపరీతాలకు తెర తీస్తున్నారు. నర్సుల్ని బస్సులు.. రైళ్లల్లో ప్రయాణించేందుకు నో చెప్పేస్తున్నారు. అంతేనా.. చివరకు రిక్షాలో తీసుకెళ్లటానికి సైతం ఒప్పుకోవటం లేని దుర్మార్గ పరిస్థితి నెలకొంది. ఆటోల్లోకి నర్సుల్ని ఎక్కించుకోవటానికి ఆటోవాలాలు నో అంటే నో అనేస్తున్నారు. 

తమ వృత్తిలో భాగంగా అనారోగ్యానికి గురయ్యే వారు ఎవరైనా సరే.. తమ సేవలతో వారికి స్వస్థత చేకూర్చేందుకు  నర్సులు తమ శాయశక్తులా కృషి చేస్తుంటారు. తమ వృత్తిలో భాగంగా మరణానికి సైతం సిద్ధపడే నర్సులు చాలామంది ఉంటారు. మరి.. అలాంటి వారిపై నిఫా మీద ఉన్న భయంతో సామాజిక వెలి ప్రదర్శించటం ఎంతమాత్రం సరికాదు.