పత్తి కొనుగోళ్లలో కుంభకోణాలు జరక్కూడదు: సీఎం జగన్‌

Published: Saturday September 26, 2020

రాష్ట్రంలో పంటల అమ్మకాలకు ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుందని రైతులకు చెప్పాలని సీఎం జగన్‌ అన్నారు. వ్యవసాయోత్పత్తుల కొనుగోలుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని, à°ˆ ఏడాది రూ.3,300 కోట్లతో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు. ఖరీ్‌ఫలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, సన్నద్ధతపై శుక్రవారం ఆయ à°¨ సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ ‘రైతులకు మార్కెట్‌ సౌకర్యంపై అవగాహన కల్పించాలి. నెల్లూరులో చోటు చేసుకున్న ఘటనలు ఎక్కడా పునరావృ తం కాకూడదు. పంటలకు కనీస గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి. భవిష్యత్‌లో ధాన్యం సేకరణ ఆర్బీకేల్లోనే జరగాలి’ అని దిశానిర్దేశం చేశారు. ‘పత్తి కొనుగోళ్లలో కుంభకోణాలు జరక్కూడదు. మా హయాంలో ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదు. రైతులకు ఉపయోగకరమైన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి’ అని సీఎం సూచించారు.