దళిత సంఘాల మండిపాటు

Published: Sunday September 27, 2020

‘‘వైసీపీ ప్రభుత్వంలో దళిత మంత్రులకు సరైన గు ర్తింపు లేదు. దీనికి దళితులందరూ సిగ్గుపడా లి. రాష్ట్రంలో దళితుల పై దాడులు జరిగిన ఘటనలో న్యాయం జరగకపోగా బాధితులపైనే కేసులు పెడుతున్నారు. దళితులను అణచివేయాలనే ధోరణిలో ప్ర భుత్వం వ్యవవహరిస్తోంది’’ అని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ అన్నారు. విజయవాడలో ‘రాష్ట్రంలో దళిత, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల పై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై న్యాయ పో రాటానికి భవిష్యత్‌ కార్యాచరణ’ అంశంపై జై భీమ్‌ యాక్సిస్‌ జస్టిస్‌ సంస్థ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఆర్‌ఎ్‌సఎస్‌ రహస్య అజెండాను రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తోందని à°ˆ సందర్భం à°—à°¾ హర్షకుమార్‌ ఆరోపించారు. జాతికోసం త్యాగం చేసిన వారే నిజమైన అంబేద్కర్‌ వాదులని మాజీ న్యాయమూర్తి, హైకోర్టు న్యాయవాది, జై భీమ్‌ యాక్సేస్‌ జస్టిస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. సీఎంను తిడితే, మాస్కులను ధరించకపోతే దళితులను చంపేస్తారా? అని ప్రశ్నించారు. న్యాయం ఊసరవెల్లి కంటే భయంకరంగా రంగులు మారుస్తోందని న్యాయాధికారి రామకృష్ణ అన్నారు. అందరికీ సమాన న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్రంలో పోలీసుల నుంచి దళితులకు రక్షణ లేదని, అందుకే తమకు లైసెన్స్‌డ్‌ గన్‌ ఇవ్వాలని రాష్ట్రపతికి లేఖ రాసినట్టు దళిత వైద్యురాలు అనితరాణి తెలిపా రు. దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి మేళం భాగ్యారావు అధ్యక్షతన జరిగిన à°ˆ సమావేశంలో పలు దళిత, ప్రజా సంఘాల నేతలు, పలువురు మాజీ న్యాయమూర్తులు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం: ఎస్‌సీ రిజర్వేషన్ల వర్గీకరణ à°† యా రాష్ర్టాల ఇష్టమని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ఆగస్టు 27à°¨ తీర్పు ఇచ్చింది. సీ à°Žà°‚ జగన్‌ ఇప్పటికీ తన అభిప్రాయం చెప్పలేదు. ఇప్ప టికైనా సీఎం తన వైఖరి ఏంటో స్పష్టం చేయాలి’’ అని ఎమ్మార్పీఎస్‌ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.