రజిణికాంత్ పార్టి గుర్తు లొ మార్పులు , తొలిగింపు .

Published: Wednesday January 03, 2018

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజిణికాంత్ రాజకీయ రంగప్రవేశం జరిగిపోయింది. చెన్నైలోని శ్రీరాఘవేంద్ర కల్యాణమండపంలో డిసెంబర్ 31à°µ తేదీ వరకు అభిమానులతో వరుసగా సమావేశం అయిన రజనీకాంత్ అదే రోజు తాను రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు . అయితే  గుర్తు విషయంలో రజనీకాంత్ మార్పులు చెశారు. ఉద్యమాలు చెయ్యడానికి నేనే సిద్దంగా ఉన్నా.రజనీకాంత్ జరిపిన సమావేశంలో వెనుక బాబా ముద్ర గుర్తు ఉన్న ఫోటో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే రజనీకాంత్ విడుదల చేసిన వెబ్ సైట్ (రజనీమండ్రం వెబ్ సైట్ ) లో బాబా ముద్రలో ఉన్న తెల్లటి తామరపువ్వును ఆకస్మికంగా తొలగించారు.

రజనీకాంత్ బాబా గుర్తు హిమాలయాల్లో ఇప్పటికే సజీవంగా ఉన్నారని విశ్వసించే బాబాజీ కుడిచేతి చూపుడు వేలు, చిటికెన వేలు పైకెత్తి మిగిలిన మూడు వేళ్లను ముడిచి వుంచే ముద్రను ఆబాణ ముద్ర అని పిలుస్తారు. రజనీకాంత్ అభిమానులతో ఏర్పాటు చేసిన అన్ని సమావేశాల్లో వెనుక కచ్చితంగా ఆముద్ర ఉంటుంది. అందులో బాబా ముద్ర కింద తెల్లటి తామరపువ్వు ఉంటుంది.

రజనీకాంత్ వెనకడుగు బీజేపీ గుర్తు తామరపువ్వు. రజనీకాంత్ ఉపయోగిస్తున్న బాబా ముద్ర కింద తెల్లటి తామరపువ్వు ఉంది. రజనీకాంత్ కచ్చితంగా బీజేపీతో జతకడుతారని దేశ వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం భవిష్యత్తులో తనకు చేటు తెస్తోందని రజనీకాంత్ ఆందోళన చెందుతున్నారని తెలిసింది.అందువళన మార్పులు చెసారు అని సమాచారం

డీఎంకే గుర్తు డీఎంకే పార్టీ గుర్తు సూర్యుడి గుర్తు. రామక్రిష్ణ పరమహంస చిహ్నంలో తామరపువ్వు, సూర్యుడు ఉదయించే గుర్తులు ఉన్నాయి. తన బాబా గుర్తులో తామరపువ్వు, సూర్యుడు ఉదయించే చిహ్నం ఉంటే కార్యకర్తలు అయోమయాని గురి అయ్యే అవకాశం ఉందని, ఓట్లు బీజేపీ, డీఎంకేకి పడే అవకాశం ఉందని యోచించిన రజనీకాంత్ సూర్యుడి గుర్తు, తామరపువ్వు గుర్తు తొలగించారని ఆయన సన్నిహితులు అంటున్నారు.