ట్విటర్‌కు భారత్ ఘాటు హెచ్చరిక

Published: Thursday October 22, 2020

మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విటర్‌ సీఈఓ జాక్ డోర్సీని భారత ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. భారత దేశ సార్వభౌమాధికారం, అఖండతలను అగౌరవపరచే ప్రయత్నాలు సహించరానివని స్పష్టం చేసింది. భారత దేశ మ్యాప్‌ను తప్పుగా చూపడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదనీయం కాదని తెలిపింది. జమ్మూ-కశ్మీరులోని లేహ్ జియో లొకేషన్‌ను చైనాలో భాగంగా ట్విటర్ చూపడంపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. 

 

ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీకి భారత ప్రభుత్వ ఐటీ సెక్రటరీ అజయ్ సాహ్నీ à°•à° à°¿à°¨ పదజాలంతో à°“ లేఖ రాశారు. ఇటువంటి ప్రయత్నాలు ట్విటర్‌కు అప్రతిష్ఠ తేవడంతోపాటు, మధ్యవర్తిగా ఉండే వేదికగా దాని నిష్పాక్షికత, తటస్థతలపై ప్రశ్నలను లేవనెత్తుతాయని పేర్కొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌ హెడ్‌క్వార్టర్ లేహ్ అని, లడఖ్, జమ్మూ-కశ్మీరు భారత దేశంలో అంతర్గత, విడదీయలేని భాగాలని వివరించారు. భారతీయుల మనోభావాలను గౌరవించాలని కోరారు. భారత దేశ సార్వభౌమాధికారం, అఖండతలను మ్యాపులు ప్రతిబింబిస్తాయని, వీటిని అగౌరవపరచడం ఆమోదయోగ్యం కాదని, చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.