ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ గందరగోళం తొలిరోజు చుక్కలు చూపించిన వెబ్‌సైట్‌

Published: Tuesday May 29, 2018


రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన ఎంసెట్‌ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ గందరగోళంగా సాగింది. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు సంబంధించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానంలో తొలిరోజే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం 11 గంటలకు లింక్‌ ఓపెన్‌ కాలేదు. ఓపెన్‌ అయ్యాక ఒకేసారి అంతా ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించేందుకు ప్రయత్నించడంతో సైట్‌ మొరాయించింది. అభ్యర్థులు టెన్షన్‌ పడ్డారు. రిజిస్ట్రేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో రూ.1200, రూ.600లు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించిన అభ్యర్థులకు ఎంసెట్‌ ఆఫీసు నుంచి లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, రిజిస్ట్రేషన్‌ నంబరు తదితర వివరాలతో మెస్సేజ్‌ రాకపోవడంతో గందరగోళం ఏర్పడింది. ఫీజు మొత్తం కట్‌ అయినట్లు బ్యాంకుల నుంచి సమాచారం వచ్చినా.. ఎంసెట్‌ ఆఫీసుల నుంచి మెస్సేజ్‌లు రాలేదు.
 
దాంతో ఏం చేయాలో పాలుపోక అభ్యర్థులు, తల్లిదండ్రులు హెల్ప్‌లైన్‌ కేంద్రాలకు పరుగులు పెట్టారు. విశాఖలో క్యాంపు అధికారి ఆచార్య నాగేశ్వరరావును నిలదీశారు. ఇక్కడికి పెద్దసంఖ్యలో బాధితులు రావడంతో గందరగోళానికి దారితీసింది. à°ˆ విషయాన్ని ఆయన ఎంసెట్‌ కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇటు ఎంసెట్‌ అడ్మిషన్స్‌ కన్వీనరు జీఎస్‌ పాండాదాస్‌.. ఉన్నత విద్యామండలి కార్యాలయంలోని ఎంసెట్‌ ఆఫీసుకు వెళ్లి స్పెషల్‌ ఆఫీసరు కె. రఘునాథ్‌తో కలిసి పరిస్థితి సమీక్షించారు. గతంలో ఏర్పాటు చేసిన 9 హెల్ప్‌లైన్‌ సెంటర్లతోపాటు కొత్తగా శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, ఒంగోలు, కడపలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు మంగళవారం ఎంసెట్‌ అడ్మిషన్స్‌ కమిటీ సమావేశం అవుతోంది. కాగా, అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు.. అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.