క్రికెట్‌లో కొత్త రూల్..

Published: Thursday November 05, 2020

 à°¤à°°à°¤à°°à°¾à°²à±à°—à°¾ ప్రపంచం ఆడుతున్న క్రికెట్‌లో రకరకాల మార్పులొచ్చాయి. 60 ఓవర్ల వన్డేలు 50 ఓవర్లకు కుదించడం, కొత్తగా 20 ఓవర్ల మ్యాచులు రావడం, ఇప్పుడు తాజాగా 10 ఓవర్ల లీగుల నిర్వహణకు సన్నాహాలు.. ఇలా ఎప్పటికప్పుడు à°ˆ గేమ్ మారిపోతూనే ఉంది. à°ˆ ఎవర్ ఛేంజింగ్ గేమ్‌లో మరో కొత్త రూల్ కోసం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ విజ్ఞప్తి చేస్తున్నాడు. à°ˆ రూల్ ఎందుకు పెట్టాలి? అని ప్రశ్నిస్తే తాజాగా ఐపీఎల్‌లో జరిగిన ఘటనను ఉదహరిస్తున్నాడు.

 

క్రికెట్ ఆటలో బౌలర్లు పరిగెత్తుకుంటూ వచ్చి తమ బలమంతా ఉపయోగించి బంతులు విసురుతారు. వాటిని బ్యాట్స్‌మెన్ చాకచక్యంగా బౌండరీలకు తరలిస్తారు. à°ˆ టగ్ ఆఫ్ వార్ ఎన్నిసార్లు చూసినా అభిమానులకు బోర్ కొట్టదు. అదే సమయంలో à°ˆ ఆటలో ప్రమాదం కూడా అంతే ఉంటుంది. బౌలర్ల కాళ్లు ఎక్కువ ఒత్తిడికి గురవుతాయి. అందుకే వారికి ఎక్కువగా కాళ్లకు గాయాలవుతుంటాయి. అలాగే ఒక్కోసారి భుజాలు కూడా దెబ్బతింటాయి. బ్యాట్స్‌మెన్లదీ అదే పరిస్థితి. ఫీల్డింగ్ సమయంలో కిందపడి ఒక్కోసారి ఎముకలు విరిగిన సందర్భాలూ ఉన్నాయి.