సర్కార్ నోటీసు కి షాక్ తిన్న 80 ఏల్ల రైతు

Published: Wednesday May 30, 2018

 à°…నారోగ్యంతో మంచాన పడిన 80 ఏళ్ల రైతుకు మధ్యప్రదేశ్ సర్కారు షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ తాలూకాకు చెందిన గణేశ్రమ్ పాటిదార్ (80) అనే రైతుకు జిల్లా అధికారులు నోటీసు పంపించారు.నీముచ్ తాలూకా ఆఫీసు ముందు జూన్ 1వతేదీన భారతీయ కిసాన్ యూనియన్ కార్యకర్తల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఉన్న నేపధ్యంలో రైతు గణేశ్రమ్ పాటిదార్ రూ.25 వేల పూచీకత్తుతో బాండుతో పాటు మంచి ప్రవర్తన ఉందనే కాండక్టు సర్టిఫికెట్ ను సమర్పించాలని జిల్లా అధికారులు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. రైతుల ధర్నాపై మధ్యప్రదేశ్ ఇంటలిజెన్స్ అధికారులు అందించిన సమాచారం మేర ముందుజాగ్రత్త చర్యగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు 80 ఏళ్ల రైతుకు నోటీసు జారీ చేసింది. రైతు గణేశ్రమ్ పాటిదార్ అనారోగ్యంతో మూడేళ్లుగా మంచాన పడి కదల్లేని పరిస్థితుల్లో ఉన్నా సర్కారు మాత్రం ఇలా బాండ్ సమర్పించాలని నోటీసు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.