తుది నిర్ణయం పవన్‌కు చెప్పిన జేపీ నడ్డా!

Published: Thursday November 26, 2020

తిరుపతి లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి ఏ పార్టీ తరఫున ఉండాలనే అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రాథమికంగా చర్చించామని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. దీనిపై à°’à°• కమిటీ నియమించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నడ్డా హామీ ఇచ్చారని వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పవన్‌, జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయాలు, అమరావతి, పోలవరం వివాదం, తిరుపతిలో పోటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పవన్‌, మనోహర్‌ విలేకరులతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోనే  కొనసాగాలనేది బీజేపీ-జనసేన కూటమి నిర్ణయం. à°ˆ విషయంలో పూర్తిగా à°…à°‚à°¡à°—à°¾ ఉంటామని నడ్డా స్పష్టమైన హామీ ఇచ్చారు. మా కూటమి రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుంది. ఇవి నా మాటలు కావు.

 

నడ్డా నోటి నుంచి వచ్చిన మాటలివి. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరిస్తామని కూడా చెప్పారు. అమరావతి రైతులకు బాసటగా ఉంటాం. చివరి రైతు వరకు న్యాయం జరిగే దాకా పోరాడతాం’ అని తెలిపారు. నడ్డా, మరికొందరు సీనియర్‌ నేతల ఆహ్వానం మేరకే తాము ఢిల్లీ వచ్చి, ఆయనతో సమావేశమయ్యామని.. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారని చెప్పారు. దాదాపు గంటపాటు సాగిన à°ˆ భేటీలో.. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించీ నడ్డా దృష్టికి తీసుకెళ్లామని.. శాంతిభద్రతలు అదుపు తప్పి సమస్యాత్మకంగా ఉందని చెప్పామన్నారు. దేవాలయాలను అపవిత్రం చేయడంతోపాటు, దేవతా విగ్రహాలద్వంసం, దేవుని రథాలను దగ్ధం  చేస్తున్న ఘటనలను కూడా వివరించామన్నారు. మనోహర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వచ్చామని, వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాల కోసం కాదని చెప్పారు. మంగళ, బుధవారాల్లో బీజేపీ కేంద్ర నాయకులతో పవన్‌ చర్చించారని అన్నారు. రాబోయే రోజుల్లో  బీజేపీ-జనసేన కూటమి సమష్టిగా పోరాడి, రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి వ్యూహరచనపై నడ్డాతో చర్చించామన్నారు. త్వరలో ఇందుకోసం రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవిక సమాచారం తెప్పించుకుని కేంద్రం న్యాయం చేస్తుందని చెప్పారని తెలిపారు.