చైనాతో సంబంధాలు బాగా దెబ్బతిన్నాయ్..

Published: Wednesday December 09, 2020

చైనాతో భారత్ సంబంధాలు చాలా దెబ్బతిన్నాయని, వాటిని ఎలా పునరుద్ధరించాలన్నది పెద్ద సమస్యగా మారిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. à°—à°¤ 30,40 సంవత్సరాలుగా ఇరు దేశాల సంబంధాల్లో సంక్లిష్టమైన దశ నడుస్తోందని స్పష్టం చేశారు. అయినా సంబంధాలు కాస్త సానుకూల దశలోనే నడుస్తున్నాయని అన్నారు.  ఎల్‌ఏసీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో చైనా వేల కొద్ది బలగాలను మోహరించిందని, దీంతో సహజంగానే ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు. ఇరు దేశాలకు చెందిన భద్రతా బలగాలు ఎదురెదురుగా వచ్చినపుడు గాల్వాన్ లాంటి ఘర్షణలు జరగడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను చైనా ఏమాత్రం పాటించడం లేదని మండిపడ్డారు. ఇరు దేశాల మధ్య సంక్లిష్ట వాతావరణం ఏర్పడ్డా, చర్చలకు ఎలాంటి ఆటంకమూ కలగదని ఆయన స్పష్టం చేశారు.  గాల్వాన్ ఘటనతోనే దేశంలో పరిస్థితులు మారలేదని, 1975లో జరిగిన ఘటనలతోనే పరిస్థితులు మారాయని ఆయన పేర్కొన్నారు.  

చర్చలు ఆగవు : చైనా ప్రతినిధి

సరిహద్దు ఘర్షణలపై త్వరలోనే ఇరు దేశాల మధ్య మరో రౌండ్ చర్చలు జరుగుతాయని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చూయింగ్ వెల్లడించారు. ‘‘ఇరు దేశాలూ కలిసి పనిచేయడానికి, ఏకాభిప్రాయం కోసం మునుపటి లాగే కొద్ది రోజుల్లోనే చర్చలు తిరిగి ప్రారంభమవుతాయి’’ అని చైనా ప్రతినిధి హువా చూయింగ్ తెలిపారు