ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి గంటా శ్రీనివాసరావు

Published: Wednesday January 03, 2018

 à°­à±€à°®à°¿à°²à°¿ : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తోందని ఏటా రూ. 65 వేల కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు అన్నారు. కాపులుప్పాడలో సర్పంచి నారుసంతోషీఎల్లాజీ అధ్యక్షతన మంగళవారం ‘జన్మభూమి-మావూరు’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రూ. 24,500 కోట్లు రైతు రుణమాఫీ చేశామన్నారు. ప్రభుత్వం ద్వారా రేషనుకార్డు, పింఛను, ఉపకారవేతనాలు, బీమా ఇలా ఏదో à°’à°• పథకం à°•à°¿à°‚à°¦ లబ్ధి పొందని కుటుంబం ఒక్కటి కూడా లేదన్నారు. ఏడాదికి ఒక్కో కుటుంబం సగటున రూ.లక్ష లబ్ధి పొందుతోందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సాధికార మిత్రలను నియమించి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. చంద్రన్న బీమా à°•à°¿à°‚à°¦ ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే గతేడాది కాలంగా రూ. 1.50 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఎన్టీఆర్‌ గృహాల కేటాయింపులో అవినీతి జరిగిందని, సంక్షేమ నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ మంత్రి వద్దకు వచ్చేందుకు జనసేన, వైకాపా నాయకులు ప్రయత్నించడంతో సభావేదిక వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. అనంతరం మంత్రి à°—à°‚à°Ÿà°¾ లబ్ధిదారులకు చంద్రన్న సంక్రాంతి కానుకలు, విద్యార్థులకు ఉపకారవేతనాలు, అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు అందించారు. వేదిక ఆవరణలో ఆరోగ్య, పశువైద్యశిబిరం, పోషకాహార ప్రదర్శన ఏర్పాటు చేశారు. జన్మభూమి జిల్లా ప్రత్యేకాధికారిణి వైవీ అనురాధ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌, ఎమ్పీడీవో హరిప్రసాదరావు, ఎంపీపీ యరబాల కృష్ణవేణి, జడ్పీటీసీ సభ్యుడు సరగడ అప్పారావు, ఎమ్పీటీసీ సభ్యులు కోడిబోయిన గౌరీరాంబాబు, తెదేపా నేతలు బోర బంగారరెడ్డి, గాడు వెంకటప్పడు, డీఏఎన్‌ రాజు, దుంప నర్సింహమూర్తి, à°—à°‚à°Ÿà°¾ ప్రతినిధి చిక్కాల విజయ్‌బాబు పాల్గొన్నారు.