చట్టాలపై నమ్మకం ఉంచండి : మోదీ

Published: Friday December 18, 2020

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ప్రజలు, రైతులు నమ్మకం ఉంచాలని ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థించారు. మంచి ఉద్దేశాలతోనే ఈ చట్టాలను తీసుకొచ్చామని, ఎలాంటి దురుద్దేశాలూ లేవని తేల్చి చెప్పారు. కనీస మద్దతు ధర కొనసాగుతుందని, దానికి ఎలాంటి ఆటంకమూ కలగదని పునరుద్ఘాటించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై మధ్యప్రదేశ్ రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రాత్రికి రాత్రే తీసుకురాలేదని, గత 20,30 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలంకషంగా చర్చించాయని అన్నారు.

 

దేశంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, కాస్త ప్రోగ్రేసివ్ భావాలతో ఆలోచించే రైతులు ఈ వ్యవసాయ సంస్కరణలను కోరుకున్నారని మోదీ పేర్కొన్నారు. కొందరి రాజకీయ పునాదులు కూకటి వేళ్లతో సహా కదులుతున్నాయి కాబట్టే, నూతన చట్టాల పేరుతో రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నూతన చట్టాలపై ఇప్పుడు లబోదిబోమంటూ కన్నీరు కారుస్తున్న వారు, ఎనిమిదేళ్లుగా స్వామినాథన్ రిపోర్టులను ఎందుకు తొక్కి పెట్టారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ గతంలో హామీ ఇచ్చిన విధంగా ఎన్నడూ రైతుల రుణాలను మాఫీ చేయలేదని మోదీ విమర్శించారు. ఎంతైతే రుణమాఫీ చేశారో... అదంతా కాంగ్రెస్ పార్టీ బంధువులకు, వారి అనుయాయులు మాత్రమే à°† లాభాన్ని పొందేవారని మోదీ వ్యాఖ్యానించారు. కేవలం పెద్ద రైతుల రుణాలను మాఫీ చేసి, కాంగ్రెస్ చేతులు దులుపేసుకుందని, పెద్ద రైతుల రుణాలు మాఫీ చేసి, పనైపోయిందని చేతులు దులుపేసుకుందని మోదీ దుయ్యబట్టారు. తన పదేళ్ల పదవీ కాలంలో కాంగ్రెస్ 50 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని చెప్పుకుందని, తమ హయాంలో మాత్రం ‘కిసాన్ సమ్మాన్ యోజన’ అనే పథకం à°•à°¿à°‚à°¦ ప్రతి యేడాది 75 వేల కోట్ల రూపాయలను రైతులకు ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు. 

 

రైతులను భ్రమల్లో ఉంచుకోవడం ప్రతిపక్షాలను మానుకోవాలని, à°ˆ నూతన చట్టాలను అమలులోకి తెచ్చి ఆరు నెలలు గడిచాయని, à°ˆ ఆరు నెలలు మౌనంగా ఉన్న విపక్షాలు హఠాత్తుగా ఉద్యమాన్ని లేవదీశాయని తీవ్రంగా ధ్వజమెత్తారు. రైతుల భుజాలపై తుపాకులను పెట్టి కాలుస్తున్నారని మోదీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ‘‘నాకేమీ క్రెడిట్ అవసరం లేదు. ఇవ్వకండి కూడా. మీమీ పాత మేనిఫెస్టోలకు à°† క్రెడిట్ ఇచ్చుకోండి. నేను రైతుల మేలునే కోరుకుంటాను. రైతులను భ్రమల్లో ఉంచకండి.’’ అని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. వ్యవసాయ సంస్కరణలు జరగడం ప్రతిపక్షాల బాధ కాదని, ఇన్నాళ్ల పాటు తాము చేయని మంచి పనులను మోదీ చేశారు కాబట్టే ప్రతిపక్షాలు à°ˆ విషయంలో à°…à°‚à°¤ మొండిగా వ్యవహరిస్తున్నాయని మోదీ అన్నారు.