రాయపాటి ఇళ్లలో సీబీఐ సోదాలు

Published: Friday December 18, 2020

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో సీబీఐ సోదాలు ముగిశాయి. గుంటూరు, హైదరాబాద్ నివాసాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. బెంగళూరు నుంచి వచ్చిన సీబీఐ అధికారులు ఏకంగా 7 à°—à°‚à°Ÿà°² పాటు విచారణ కొనసాగించారు. ట్రాన్స్‌రాయ్ సంస్థ బెంగళూరులోని కెనరా బ్యాంక్‌కు రుణాలు చెల్లించలేదు. ఇందులో భాగంగానే కెనరా బ్యాంకు ఉద్యోగులతో కలిసే సీబీఐ అధికారులు రాయపాటి నివాసాలకు చేరుకున్నారు. à°ˆ రెండు సంస్థల మధ్య జరిగిన లావాదేవీలపై, ట్రాన్స్‌ట్రాయ్ సంస్థతో ఉన్న సంబంధాలపై రాయపాటిని సీబీఐ బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కెనరా బ్యాంకు నోటీసు కాపీలను సీబీఐ తీసుకెళ్లింది. దాదాపు ఏడు à°—à°‚à°Ÿà°² పాటు సాగిన à°ˆ విచారణకు రాయపాటి కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించారు. à°ˆ విచారణలో రాయపాటి స్టేట్‌మెంట్‌ను కూడా సీబీఐ రికార్డ్ చేసినట్లు సమాచారం. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సీబీఐ సోదాలు... సాయంత్రం 3 à°—à°‚à°Ÿà°² వరకు నిరాటంకంగా à°ˆ సోదాలు సాగాయి.