ప్రేమోన్మాది చేతిలో దళిత యువతి స్నేహలత దారుణ హత్య

Published: Friday December 25, 2020

 à°ªà±à°°à±‡à°®à±‹à°¨à±à°®à°¾à°¦à°¿ చేతిలో దళిత యువతి స్నేహలత దారుణ హత్యకు గురైన ఘటనపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. స్నేహలత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిలను దళిత సంఘాల, వామపక్ష నేతలు నిలదీశారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ‘దిశ’ చట్టం తెచ్చినా అకృత్యాలు ఆగడం లేదన్నారు. స్నేహలతను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వన్‌టౌన్‌ సీఐ ప్రతా్‌పరెడ్డిని సస్పెండ్‌ చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కాగా.. అంతకుముందు స్నేహలత మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించిన వాసిరెడ్డి పద్మ, తలారి రంగయ్య, వెంకటరామిరెడ్డి అనంతరం ఆమె తల్లి లక్ష్మీదేవిని పరామర్శించారు.  

స్నేహలత కుటుంబానికి ప్రభుత్వం à°…à°‚à°¡à°—à°¾ ఉంటుందని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. స్నేహలత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడు తూ.. డీజీపీతో చర్చించి నిందితులకు శిక్షలు పడే లా కమిషన్‌ చర్యలు తీసుకుంటుందన్నారు.

స్నేహలత కుటుంబానికి చట్టపరంగా వచ్చే సాయంతో పాటు అదనంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించినట్లు మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ తెలిపారు. తక్షణ సాయంగా రూ.4,12,500 మంజూరు చేస్తున్నామన్నారు. బాధిత కుటుంబానికి ఇంటిస్థలం, ఇల్లు అందజేస్తామన్నారు. కుటుంబసభ్యుల్లో à°’à°•à°°à°¿à°•à°¿ ఉద్యోగంతో పాటు ఐదెకరాల పొలం ఇస్తామన్నారు.