అంతర్వేది నుంచి రామతీర్థం వరకు ద్వేష దాడులు

Published: Saturday January 02, 2021

అందరినీ రక్షించేవాడు దేవుడని ఆయనను విశ్వసించేవారి నమ్మకం. అందరూ తమ రక్షణ కోసం, తమ కష్టాలు తీరేందుకోసం ఆయన వద్దకు వెళుతుంటారు. అలాంటిది ఇప్పుడాయననే కాపాడుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలు చూసి భక్తులు ఇప్పుడు ఇదే కలవరానికి గురవుతున్నారు. రాష్ట్రంలో గతంలోనూ ప్రాచీన దేవాలయాలు, పవిత్ర విగ్రహాలకు అపచారం వాటిల్లింది. గుప్తనిధుల అన్వేషణ, స్మగ్లింగ్‌ అవసరాల కోసం ఆయా ఘటనలు అప్పట్లో జరిగాయి. అలా ఆర్థిక లబ్ధిని ఆశించి జరిగిన ఘటనలు కావివి. ఉదాహరణకు విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తల నరికేసిన ఘటనలో, స్వామి à°’à°‚à°Ÿà°¿ మీది వెండి ఆభరణాల జోలికి పోలేదు. ఆయన తలను విగ్రహం నుంచి తొలగించి అక్కడే ఉన్న కోనేరులో దానిని పడేసి పోయారు. à°ˆ ఒక్క ఘటనలోనే కాదు.. రాష్ట్రంలో ధ్వంసానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న ఎన్నెన్నో ఉదంతాల్లో జరిగింది ఇదే. దీన్నిబట్టి à°ˆ పనులు చేస్తున్నవారి ఉద్దేశ్యం సుస్పష్టంగానే అవగతం అవుతోందని పలువురు భక్తులు, హిందూసంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

 

ప్రశాంత వాతావరణం, మత సామరస్యం నిండుగా ఉండే మన రాష్ట్రంలో సాధారణంగా విద్వేషాలకు చోటిచ్చే ఘటనలు జరగడం తక్కువే. మతం పేరిట విద్వేషం అన్నది లేదు. కానీ ఇటీవల కాలంలో వరుసపెట్టి దేవాలయాలు, రథాలు, విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయి. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. రథాలను తగలబెట్టారు. కొత్త ఏడాది తొలి రోజునే తూర్పుగోదావరి జిల్లా రామమహేంద్రవరంలోని శ్రీరాంనగర్‌లోని విఘ్నేశ్వర ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం రెండు చేతులు విరిచేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏడాది  కాలంగా ఇలాంటివే ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇన్ని జరుగుతున్నా ఒక్కచోట కూడా నిందితులను పట్టుకోకపోవడం మరిన్ని ఘటనలు జరిగేందుకు కారణమవుతుందన్న విమర్శలున్నాయి. ఏడాదికాలంగా ప్రారంభమైన à°ˆ మనోభావాలు గాయపరిచే ప్రక్రియకు చెక్‌పెట్టే ప్రయత్నాలు జరగాల్సినంత స్థాయిలో జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 

 

విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో కోదందరామస్వామి ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తల నరికేసిన ఘటనకు ఈ నిర్లిప్తతే కారణమయిందని అంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పెద్ద సంఖ్యలో జరిగాయి. పోలీసుల లెక్క ప్రకారం 20లోపే ఉన్నా...వాస్తవానికి అంతకు నాలుగింతలు ఉన్నాయని అంచనా. ఒక్క సెప్టెంబరులోనే రాష్ట్రంలోని నలుమూలల ఆరు చోట్ల ఆలయాల్లో అపచారం జరిగింది. ఏ ఒక్క కేసులోనూ ప్రభుత్వం ఖరాఖండీగా వ్యవహరించడం లేదని, ఫలితంగానే ఇలాంటి దారుణాలు పెచ్చుమీరుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.