అట్రాసిటీ చట్టం దుర్వినియోగంపై నేడు నిరసన

Published: Monday January 04, 2021

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ దుర్వినియోగంపై జేసీ సోదరులు సోమవారం తాడిపత్రిలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. పట్టణంలో కొవిడ్‌-19 నిబంధనలు, 144 సెక్షన్‌, 30 పోలీసు యాక్ట్‌ అమలులో ఉన్నాయని, నిరసన దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఎన్ని ఆంక్షలు ఉన్నా నిరసన దీక్షకు వెనుకంజ వేసేది లేదని జేసీ సోదరులు స్పష్టం చేశారు. à°ˆ నేపథ్యంలో పట్టణంలో హైటెన్షన్‌ నెలకొంది. దీంతో భారీగా మోహరించిన పోలీసులు పట్టణంలో కవాతు నిర్వహించారు. ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

‘‘పోలీసులూ..! à°®à±€à°•à±‹ నమస్కారం. రాజకీయాలకతీతంగా చేపట్టిన ఇద్దరి నిరసన దీక్షకు భారీగా పోలీసులను రప్పించడం ఏమిటి? దుర్వినియోగం అవుతున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై శాంతియుతంగా చేపట్టనున్న నిరసన దీక్షకు à°ˆ ఆంక్షలు ఏమిటి?’’ అని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొవిడ్‌ వల్ల తన ఆరోగ్యం దెబ్బతింటుందన్న ఆందోళనతో సోదరుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనకు మద్దతుగా నిరసన దీక్షలో పాల్గొననున్నారని తెలిపారు. కాగా, సోమవారం తెల్లవారు ఝామున జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డిలను గృహ నిర్బంధంలోకి తీసుకోవాలని పోలీసులు ఆలోచిస్తున్నట్లు భోగట్టా. అలాగే à°ˆ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా ముఖ్య అనుచరులను సైతం అదుపులోకి తీసుకోనున్నట్లు తెలిసింది.