ఎయిర్‌ ఇండియా షాక్‌.. శుభవార్త చెప్పిన దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌

Published: Saturday June 02, 2018


అంతర్జాతీయ హోదా వచ్చి అర్థ సంవత్సరం గడుస్తున్నా అంతర్జాతీయ విమానాలు నడవకపోవటంతో ప్రాభవం మసకబారుతున్న తరుణంలో ఫ్లై దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ ఆశలు చిగురింప చేస్తోంది. à°ˆ నెలలోనే కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక్ష అంశాలకు సంబంధించి సమావేశం జరగనుంది. à°ˆ క్రమంలో విజయవాడ నుంచి దుబాయ్‌కు స్లాట్‌ కోరిన ఫ్లై దుబాయ్‌ సంస్థ దరఖాస్తును కూడా పరిశీలించటం జరుగుతుంది. దుబాయ్‌ ప్రభుత్వంతో జరిగే ద్వైపాక్షిక ఒప్పందాలు చాలా ఉన్నాయి. అక్కడి విమానయాన సంస్థలు సీట్ల సర్దుబాటు కోసం కేంద్రంతో ఇప్పటికే సంప్రదింపులు చేయటం జరుగుతోంది. వీటన్నింటినీ పరిశీలించిన మీదట విజయ వాడ నుంచి కనీసం 100 నుంచి 150 లోపు సీట్లకు కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు చేయగలిగితే ప్రత్యేక విమాన సర్వీసును నడపటానికి అవకాశం కలుగుతుంది. విజయవాడ నుంచి దుబాయ్‌కు నేరుగా ఫ్లై దుబాయ్‌ సంస్థ ప్రత్యేక విమానం నడపటానికి అవకాశం కలుగుతుంది. మరో రెండు వారాలలో జరిగే కేంద్ర సమావేశంపై ఎయిర్‌పోర్టు వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి.
 
            వాస్తవానికి à°ˆ నెలలో దుబాయ్‌, షార్జాలకు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ తన తొలి అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించాల్సి ఉండగా.. విదేశీ సర్వీసును నడిపే విషయంలో à°† సంస్థ తప్పుకుంది. హాపింగ్‌ ఫ్లైట్స్‌కు సెక్యూరిటీ పరంగా అనుమతులు ఇవ్వకపోవటం, ద్వైపాక్షిక్ష ఒప్పందాలలో భాగంగా దుబాయ్‌ కు సీట్ల సర్దుబాటుకు సంబంధించి కేంద్రస్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల వల్ల స్లాట్‌ దక్కదన్న ఉద్దేశ్యంతోనూ, ప్రైవేటీకరణ బాటలో ఉన్న ఎయిర్‌ ఇండియా సంస్థ నూతన ప్రయోగాల పట్ల ఆనాసక్తి చూపటం వంటి కారణాల రీత్యా బెజవాడ నుంచి అంతర్జాతీయ ఫ్లైట్‌ను నడిపే అవకాశం తప్పింది. à°ˆ క్రమంలో కిందటి నెల చివర్లో 24, 25 తేదీల్లో చెన్నైలో జరిగిన సదరన్‌ రీజియన్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌ వల్ల అనుకోకుండా ఫ్లై దుబాయ్‌ నుంచి ఆసక్తి వ్యక్తమైంది. ఏపీ, తెలంగాణా, తమిళనాడు, పాండిచ్చేరి, లక్షద్వీప్‌ తదితర ఏడు రాష్ర్టాల నుంచి మొత్తం 22 విమానాశ్రయాల నుంచి అధికారులు, ఆయా విమానయాన సంస్థలు, రీజనల్‌ హెడ్‌ ఆఫ్‌ ఎయిర్‌పోర్టు తదితరులు పాల్గొన్నారు.