2కోట్ల వ్యయంతో ఆలయాలు పునర్నిర్మాణం

Published: Thursday January 07, 2021

శుక్రవారం ఉదయం 11:01కు సీఎం జగన్ తొమ్మిది దేవాలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. దుర్గమ్మ దర్శనం చేసుకుని, ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 2కోట్ల వ్యయంతో ఆలయాలు పునర్నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ ద్వారా చుట్టూ సుందరీకరణ చేస్తామన్నారు. ప్రభుత్వ నిధులతో అమ్మవారి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఆయన తెలిపారు. రేపు ఉదయం అమ్మవారి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు 70 కోట్లతో శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. అందరి మనోభావాలు దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ దేవాలయాల పునర్నిర్మాణం చేస్తున్నారని పేర్కొన్నారు. బీజెపీ, టీడీపీ కలిసి ఉన్న ప్రభుత్వంలో ఈ దేవాలయాలు కూల్చారని తెలిపారు. విగ్రహాలపై దాడులను ఖండిస్తున్నామని ప్రకటించారు. దొంగే దొంగ..దొంగ.. అన్నట్టు టీడీపీ వ్యవహారం ఉందని బొత్స సత్యనారాయణ ఎద్దేవాచేశారు.