హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

Published: Saturday January 16, 2021

అనంతపురంలో వ్యాక్సిన్‌ వేయించుకున్న హెల్త్ వర్కర్ à°…à°–à°¿à°² అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ వేసుకున్న కొద్దిసేపటికే అఖిలకు వాంతులు చేసుకుంది. దీంతో ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ఆమెకు వైద్యులు  చికిత్స అందించారు. ప్రస్తుతం à°…à°–à°¿à°² ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతకుముందు విజయవాడలోని జీజీహెచ్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌ అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ వేసిన వెంటనే హెల్త్‌ వర్కర్‌ రాధ కళ్లు తిరిగి పడ్డారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అట్లాగే తెలంగాణలోని సంగారెడ్డి ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌ అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్‌ తీసుకున్న ఏఎన్‌à°Žà°‚ సంగీతకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొవిడ్‌ టీకా తీసుకున్న వెంటనే తల తిప్పుతుందని వైద్యులకు సంగీత చెప్పారు. à°† తర్వాత ఆమె వాంతులు చేసుకోవడంతో సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పంపిణీ కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది.