25నుంచి ఆసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌

Published: Wednesday January 20, 2021

ఆసెట్‌-2020 రెండవ విడత కౌన్సెలింగ్‌ ఈనెల 25 నుంచి 28à°µ తేదీ వరకు జరుగుతుందని ఏయూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ప్రొఫెసర్‌ డీఏ నాయుడు మంగళవారం తెలిపారు. ఆసెట్‌, ఆఈట్‌ రెండవ విడత కౌన్సెలింగ్‌కు ఈనెల 22 నుంచి 24 వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌, సర్టిఫికెట్‌లు అప్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. ఆఈట్‌-2020 రెండవ విడత కౌన్సెలింగ్‌ ఈనెల 27, 28 తేదీల్లో జరుగుతుందని పేర్కొన్నారు. 30à°¨ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామని, ఈనెల 31, ఫిబ్రవరి 1à°¨ ఫీజు చెల్లించాలని తెలిపారు. సీట్లు వచ్చినవారు ఫిబ్రవరి 2à°¨ ప్రిన్సిపాల్స్‌కు రిపోర్టు చేయాలని ఆయన కోరారు.