ఆలస్యంగా వెలుగులోకి.. శిశువుకు జన్మనిచ్చిన ఇంటరు విద్యార్థిని

Published: Wednesday January 03, 2018

పాడేరు : à°“ ఇంటరు విద్యార్థిని కడుపునొప్పిగా ఉందని ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే ఆడ శిశువుకు జన్మనిచ్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. పాడేరు ప్రాంతీయ ఆసుపత్రిలో డిసెంబరు 30à°¨ à°ˆ ఘటన చోటుచేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివాహం కాకుండానే పదిహేడేళ్లకే విద్యార్థిని à°“ బిడ్డకు జన్మనివ్వడంపై స్థానికంగా కలకలం రేగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు మండలం లింగపుట్టు గ్రామానికి చెందిన à°“ యువతి హుకుంపేటలోని కళాశాలలో ఇంటరు చదువుతోంది. ప్రేమ వ్యవహారంలో ప్రియుడితో శారీరకంగా దగ్గర కావడంతో గర్భం దాల్చింది. నెలల నిండాయి. అయితే శిశువు పుట్టిన తర్వాత ఇంటికి తీసుకువెళ్తే పరువు పోతుందని విద్యార్థిని తల్లి భావించింది. కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పి బాలికను ఆసుపత్రికి తీసుకొచ్చింది. ప్రసవించిన వెంటనే ఆసుపత్రి పరిసరాల్లో నివాసం ఉంటున్న à°“ దంపతులకు శిశువును పెంచుకోమని చెప్పి అప్పగించింది. కుమార్తెతో కలిసి స్వగ్రామానికి వెళ్లిపోయింది. అయితే శిశువు తక్కువ బరువుతో జన్మించడంతో స్థానిక శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్‌కు తరలించాలని వైద్యాధికారి సందీప్‌ సూచించారు. కేజీహెచ్‌కు తీసుకువెళ్లేందుకు అంబులెన్సు సిద్ధంగా చేయగా ఈలోగా శిశువు మృతి చెందింది.