ఏడాదిన్నరగా బాలుడు మాయం... చివరికి మృత దేహం లభ్యం

Published: Monday June 04, 2018

18 నెలలుగా కనిపించకుండా పోయిన నాలుగేళ్ల జైద్ ఎప్పటికైనా తిరిగివస్తాడని భావించిన అతని కుటుంబ సభ్యుల ఆశలు అడియాసలయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో à°—à°² షమ్షాద్ గార్డెన్‌లో ఉంటున్న నజర్ మొహమ్మద్ కుమార్తె నిన్న సాయంత్రం డాబా శుబ్రం చేసేందుకు వెళ్లింది. à°ˆ నేపధ్యంలో ఆమెకు పక్కనేవున్న బిల్డింగ్‌ డాబాపై తెరిచివున్న à°’à°• బాక్సు కనిపించింది. దానిలో ఎప్పుడో అదృశ్యమైన తన సోదరుడు జైద్ మృతదేహం ఉంది. వెంటనే ఆమె కిందకు వచ్చి à°ˆ సంగతిని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు స్కూలు డ్రెస్ ఆధారంగా జైద్‌ను గుర్తుపట్టి à°ˆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. నర్సరీ చదువుతున్న జైద్ 2016 డిసెంబరు 1 à°¨ సాయంత్రం ఆడుకోవడానికని వెళ్లి మాయమయ్యాడు. 2à°µ తేదీన జైద్ కుటుంబ సభ్యులు à°ˆ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. à°ˆ నేపధ్యంలోనే జైద్‌ను కిడ్నాప్ చేశామని, డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తూ, అతని తండ్రికి బెదరింపు ఫోన్లు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొబైల్ లొకేషన్ ఆధారంగా ఆఫ్తాబ్, ఇర్ఫాన్ అనే యువకులనుఅరెస్టు చేశారు. అయితే తాము రైల్వే స్టేషన్లో à°ˆ బాలుడు అదృశ్యంపై ఉన్న ప్రకటన చూసి డబ్బుల కోసం ఫోన్ చేశామని చెప్పారు. à°† తరువాత పోలీసులకు జైద్ అదృశ్యంపై ఎటువంటి వివరాలు లభ్యంకాలేదు.