బంగారం రేజర్‌తో నున్నని షేవింగ్.

Published: Monday June 04, 2018

 à°ˆ ప్రపంచంలో ఏదైనా కొత్తగా కనిపిస్తేచాలు జనం సులభంగా ఆకర్షితులవుతారు. సాధారణంగా బార్బర్లు హెయిర్ స్టయిల్ విషయంలో తమ ప్రత్యేకత చూపిస్తూ పేరు తెచ్చుకుంటారు. అయితే వీటికి భిన్నంగా à°’à°• బార్బర్ జనాన్ని ఇట్టే ఆకట్టుకుంటున్నారు. పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ పట్టణంలోని ఉస్తారా మెన్స్ స్టూడియో ముందు ప్రతినిత్యం పెద్ద క్యూ కనిపిస్తుంటుంది. à°ˆ సెలూన్ యజమాని రామచంద్ర దత్తాత్రేయ తనదైన స్టయిల్‌తో రోజురోజుకూ మరింత ఫేమస్ అవుతున్నారు. ఇక్కడ షేవింగ్ కోసం బంగారంతో చేసిన ఉపకరణాలు వినియోగిస్తుంటారు. రామచంద్ర తన తల్లిదండ్రుల 33à°µ వివాహ వార్షికోత్సవానికి గుర్తుగా స్వర్ణకారుని చేత వీటిని తయారు చేయించారు. వీటి తయారీకి రూ. 3 లక్షలు ఖర్చయ్యింది. à°ˆ విషయమై రామచంద్ర మాట్లాడుతూ ‘నేను విభిన్నంగా ఏదైనా చేయాలనుకుని, ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను. ఇది అందరికీ నచ్చింది. గతంలో షేవింగ్‌కు రూ. 40 తీసుకునే వాడిని. ఇప్పడు రూ. 200 ఛార్జ్ చేస్తున్నాను’ అన్నారు.