ప్రేమికుల రోజు బహుమతంటూ నేరగాళ్ల వల

Published: Wednesday February 03, 2021

ప్రముఖ సంస్థ టాటా పేరుతో సైబర్‌నేరగాళ్లు డేటా చోరీకి పాల్పడుతున్నారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, ప్రేమికుల రోజున మొబైల్‌ గెలుచుకోవచ్చంటూ అమాయకులకు గాలం వేస్తున్నారు. à°ˆ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు సులువైన ప్రశ్నలకు సమాధానాలు చెబితే ఎంఐ11à°Ÿà±€ ఫోన్‌ గెలుచుకోవచ్చని ఉచ్చులోకి దింపుతున్నారు. à°† తర్వాత ఫోన్‌ గెలుచుకున్నారని మెసేజ్‌ వస్తుం ది. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తారు. అది డౌన్‌లోడ్‌ చేసుకున్న వెంటనే ఫోన్‌, లాప్‌టా్‌పలోని డేటా చోరీ అవుతుందని పోలీసులు తెలిపారు. బ్యాంకు లావాదేవీలన్నీ నేరగాళ్లకు చేరుకొంటాయన్నారు. టాటా ప్రమోషన్‌ను ఐదు వాట్సాప్‌ గ్రూపులు లేదా 20 మంది స్నేహితులకు పంపించాలనే సూచనతో నేరగాళ్లు పంపే లింక్‌ను ఇతరులకు పంపుతున్నారని పోలీసులు చెప్పారు.