ఐదుగురి టీకా ఒకరికే ఇచ్చేశారు

Published: Sunday February 07, 2021

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ కరోనా టీకా అయినా రెండు డోసులు మాత్రమే ఇవ్వాలి.. డోసుల మధ్య కనీసం నెల రోజుల à°Žà°¡à°‚ ఉండాలి! కానీ à°“ వ్యక్తి ఒకేసారి ఐదు కరోనా టీకాల డోసులు తీసుకున్న ఘటన సింగపూర్‌లో ఇటీవల చోటుచేసుకుంది. సింగపూర్ నేషనల్ ఐ సెంటర్‌లోని సిబ్బంది ఒకరు ఏకంగా ఐదు ఫైజర్ టీకా డోసులు తీసుకున్నట్టు తెలిసింది. జనవరి 14à°¨ జరిగిన à°ˆ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రోటోకాల్ ప్రకారం..  ఫైజర్ టీకాను డైల్యూట్ చేసి(సాంద్రత తగ్గించి) దాన్ని సామర్థ్యాన్ని ఐదో వంతుకు తగ్గించి à°† తరువాత టీకా ఇవ్వాలి. అయితే..డైల్యూట్ చేయడం ప్రారంభించిన వర్కర్ ఒకరు మరో పనిమీద వెళ్లడంతో à°† స్థానంలోకి వచ్చిన మరో వ్యక్తి డైల్యూషన్ పూర్తైందని పొరబడి.. అదే టీకాను సదరు వ్యక్తికి ఇచ్చేశాడు. దీంతో.. అతడు à°’à°• డోసుకు బదులు ఏకంగా ఐదు డోసులు ఒకేసారి తీసుకున్నట్టైంది. 

అయితే..సిబ్బంది à°ˆ తప్పిదాన్ని వెనువెంటనే గుర్తించారు. సీనియర్ డాక్టర్లను అప్రమత్తం చేశారు. వారు సదరు వ్యక్తిని పరిశీలించి..అతడిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధారించారు. మరో రెండు రోజుల పాటు అతడిని ఆస్పత్రిలోనే ఉంచి పరిశీలించారు. ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాక అతడిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. సింగపూర్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 30à°¨ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ఫైజర్-బయోఎన్‌టెక్ టీకాను ఎంచుకుంది. తొలి విడతలో వైద్య సిబ్బందికి మాత్రమే టీకా ఇస్తున్నారు. టీకా సరఫరాలో ఎటువంటి అవాంతరాలు తలెత్తని పక్షంలో à°ˆ ఏడాది చివరికల్లా ప్రజలందరికీ టీకా అందుతుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు.