తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై నేడే తొలి అడుగు

Published: Tuesday February 09, 2021

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూతురు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా రంగంలోకి దిగారు. ఇందుకు అవసరమైన సన్నాహాలను మంగళవారం నుంచి మొదలు పెడుతున్నారు. తొలుత ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. à°ˆ మేరకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు, వైఎస్సార్‌ అభిమానులకు సమాచారం అందించారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌తో విభేదించి షర్మిల క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారని, తెలంగాణలో కొత్త పార్టీ పెట్టనున్నారని, అందుకు సంబంధించి ఫిబ్రవరి 9à°¨ తొలి అడుగు పడనుందని ‘ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ ఇటీవల తన ‘కొత్త పలుకు’ కాలమ్‌ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే.  దీనిపై వైసీపీ నేతలెవరూ స్పందించలేదు. ప్రముఖ నేతలంతా మౌనం దాల్చారు. అంతేకాదు.. సోషల్‌ మీడియాలోనూ ఎవరూ స్పందించవద్దని తమ పార్టీ శ్రేణులను వైసీపీ ఆదేశించినట్లు తెలిసింది. షర్మిల సోమవారం ఉదయం బెంగళూరు నుంచి హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నట్లు సమాచారం.

 

అయితే వారం ముందు నుంచే ఆమె కార్యాలయం నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన.. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ వంటి ప్రధాన రాజకీయ పార్టీల్లో క్రియాశీలకంగా లేని పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం వైఎస్‌  50à°µ పెళ్లిరోజు సందర్భంగా హైదరాబాద్‌లో జరిగే ఆత్మీయ సమ్మేళనానికి రావాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలకు సమాచారం అందింది.  టీటీడీ సలహా సంఘం సభ్యుడు, మొదటినుంచీ వైఎస్‌ కుటుంబంతో కలిసి పనిచేస్తున్న పిట్టా రాంరెడ్డి ఆధ్వర్యంలో జన సమీకరణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 10.30 నుంచి 11.30 à°—à°‚à°Ÿà°² వరకు  150 మంది ముఖ్య కార్యకర్తలతో షర్మిల సమావేశం కానున్నారు. à°ˆ భేటీకి అక్కడి నుంచి తరలి రావడానికి దాదాపు 3వేల మంది సిద్ధమవుతున్నట్లు à°† జిల్లా నేతలు చెబుతున్నారు.