గంటా చేరికపై విజయసాయి కీలక వ్యాఖ్యలు

Published: Wednesday March 03, 2021

: à°µà±ˆà°¸à±€à°ªà±€à°²à±‹ టీడీపీ ఎమ్మెల్యే à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస్ చేరికపై రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ చేరిక సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు గతంలో కొన్ని ప్రతిపాదనలు పంపించారన్నారు. వాటిని పార్టీ ఆమోదిస్తే వైసీపీలో చేర్చుకుంటామన్నారు. ఆయన వైసీపీ సర్కార్, జగన్ చేస్తున్న అభివృద్ధిచూసి ఆకర్షితుడయ్యారని పేర్కొన్నారు. టీడీపీ నుంచి మరిన్ని వలసలు ఉంటాయన్నారు. వైసీపీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవన్నారు. కొన్ని నిర్ణయాలు కొంతమందికి నచ్చవచ్చు..నచ్చకపోవచ్చన్నారు. పార్టీ బలోపేతం అవసరం ఉందన్నారు.  

 

వైసీపీలో à°—à°‚à°Ÿà°¾ చేరికపై à°—à°¤ కొన్నిరోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర మంత్రి, విశాఖలో కీలక నేతగా ఉన్న అవంతి శ్రీనివాస్ కారణంగా అది ఆలస్యమవుతుందనే వార్తలు వచ్చాయి. పార్టీలో అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామనే ధోరణిలో అప్పట్లో వైసీపీ అధిష్ఠానం ఉంది. అవంతిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా జరిగాయనే చర్చ జరిగింది. కానీ తాజాగా విజయసాయి వ్యాఖ్యలు విశాఖ వైసీపీ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి.  కొన్ని నిర్ణయాలు కొంతమందికి నచ్చవచ్చు..నచ్చకపోవచ్చు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అవంతిని ఉద్దేశించి చేసినవిగానే ఉన్నాయన్న చర్చ జరగుతోంది.