ఒక్క నెల ముచ్చటగా ఇంటింటికీ రేషన్‌

Published: Saturday March 13, 2021

 à°¸à°¾à°®à°¾à°¨à±à°¯à±à°²à°•à± రేషన్‌ తీసుకోవడం à°’à°• ప్రహ సనంగా మారింది. డోర్‌ డెలివరీ ప్రవేశపెట్టిన తర్వాత మొదటినెల సాధక బాధ కాలు ఉంటాయిలే అనుకున్న జనాలకు రెండో నెల కూడా ఇవే కష్టాలు ఎదుర వుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇంటి వద్దకే రేషన్‌ సరుకులని ఆర్భాటంగా కార్యక్రమాలు ప్రారంభిస్తే à°† ఫలితాలు క్షేత్రస్థాయిలో కన్పించడం లేదు. ఎక్క డైనా à°’à°• పద్ధతి నుంచి మరో పద్ధతికి మార్పు చేస్తున్నారంటే అంతకు ముందు న్న పద్ధతులతో పోలిస్తే కొత్త విధానం ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుంది. రేషన్‌ డోర్‌డెలివరీ పరిస్థితి చూస్తే మాత్రం అందుకు భిన్నంగా కన్పిస్తోంది. పేదలకు కష్టాలు తీర్చాల్సిందిపోయి మరింత పెంచుతుందని à°† వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈనెల ఇంటివద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ à°’à°• నెల ముచ్చటగానే మారేలా ఉంది. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయడం à°¤ à°® వల్ల కాదంటూ ఇప్పటికే ట్రక్కు నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఇంటింటికీ రేషన్‌ పంపిణీ సక్రమంగా జరగడం లేదు. మండలంలోని పలు షాపుల్లో కార్డుదారులకు పాత పద్ధతుల్లోనే ఆయా డిపోల్లో రేషన్‌ సరు కులు అందజేస్తున్నారు. ఈనెల 12à°µ తేదీ దాటినా ఇంతవరకూ గ్రామీణ ప్రాంతాల్లో సరాసరి చూసుకుంటే 50 శాతం కూడా రేషన్‌ పంపిణీ జరగకపోవడం గమనార్హం. 

ఇంటివద్దకే రేషన్‌ సరుకులు అని పాలకులు గొప్పలు చెప్తున్నా చాలాచోట్ల à°† పరిస్థితి కన్పించడం లేదు. ఇటు పట్టణంలోనూ అటు గ్రామీణ ప్రాంతాల్లో వీధికి à°’à°• చోట బండి ఆపి కార్డు దారులను అక్కడికే రమ్మంటున్నారు. ఇక గ్రామాల్లో అయితే ఊరులో ఒకే చోట అందరినీ పిలుస్తున్నారు. దీంతో కార్డుదారులు వీధిలో నిలబడాల్సి వస్తోంది. చాలామంది దీనిని అవమానంగా, చిన్నతనంగా భావిస్తున్నారు. ప్రతి ఇంటి ముందు ఆపాలంటే à°ˆ–పోస్‌ సిగ్నల్‌ సమస్య ఏర్పడుతుందని, ఛార్జింగ్‌ కూడా త్వరగా అయిపోతుందని రేషన్‌ పంపిణీ దారులు చెబుతున్నారు. ఒక్కోసారి à°—à°‚à°Ÿà°² తరబడి  సిగ్నల్‌ అందడం లేదంటున్నారు. వారు చెప్పేది కూడా సహే తుకంగానే కన్పిస్తోంది. కార్డుదారులకు ఎప్పుడు ఇస్తారో, ఎక్కడ ఇస్తారో తెలి యడం లేదు. ఇళ్ల వద్ద ఉన్న వారు మాత్రమే సరుకులు తీసుకోగలుగుతు న్నారు. మిగిలిన వారు రేషన్‌కోసం పాట్లు పడాల్సి వస్తోంది. దీంతో చాలా మంది రేషన్‌ కోసం పనులు మానుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.