టీడీపీకన్నా వైసీపీకి 68,399 ఓట్లు అధికం

Published: Tuesday March 16, 2021

మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) ఎన్నికల్లో 58 వార్డులను గెలుచుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి, 30 వార్డులను గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకి మధ్య ఓట్ల తేడా 6.67 శాతం మాత్రమే వుంది. 98 వార్డుల్లో పోటీచేసిన వైసీపీ 42.40 శాతం ఓట్లు సాధించగా, 94 వార్డుల్లో పోటీ చేసిన టీడీపీ 35.73 శాతం ఓట్లు సాధించింది. తర్వాత 11.35 శాతం ఓట్లతో బీజేపీ/ జనసేన మూడో స్థానంలో వున్నాయి. కొన్ని వార్డుల్లో స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థులు గట్టెక్కడం గమనార్హం.

 

మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పరిధిలో  17,26,158 మంది ఓటర్లు వున్నారు. మొత్తం 98 వార్డులు వున్న జీవీఎంసీ పాలకవర్గానికి ఈనెల పదో తేదీన జరిగిన ఎన్నికల్లో  10,25,442 (59.41శాతం) మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో 23,458 (2.28శాతం) ఓట్లు ముగిరిపోయాయి. నోటా(నన్‌ ఆఫ్‌ ది అబౌ)కు 9,909 (0.96శాతం) ఓట్లు పడ్డాయి. మిగిలిన ఓట్లతో అధికార పార్టీ వైసీపీకి 4,34,836 (42.40శాతం) పోలయ్యాయి. 98 వార్డుల్లో పోటీచేసిన à°† పార్టీ అభ్యర్థులు 58 వార్డుల్లో మొదటి స్థానంలో నిలిచి, కార్పొరేటర్లుగా గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ రెండు వార్డుల్లో వామపక్షాలకు, మరో రెండు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతిచ్చి... 94 వార్డుల్లో  పోటీ చేసింది. టీడీపీ అభ్యర్థులకు మొత్తం 3,66,437 (35.73 శాతం) ఓట్లు వచ్చాయి. 30 వార్డుల్లో గెలుపొందారు. వీటిల్లో అత్యధిక వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలు సాధించారు. అదే విధంగా ఓడిపోయిన స్థానాల్లో పలుచోట్ల కొద్ది ఓట్ల తేడాతో కోల్పోయారు. కాగా బీజేపీ, జనసేన పార్టీలు  ఎన్నికల పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాయి. బీజేపీ 44 స్థానాల్లో, జనసేన 51 స్థానాల్లో పోటీ చేశాయి. ఇరు పార్టీలు కలిపి 1,16,393 (11.35 శాతం) ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాయి. జనసేన అభ్యర్థులు మూడు వార్డుల్లో, బీజేపీ à°’à°• వార్డులో విజయం సాధించాయి. 75 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌ పార్టీ 6,421 (0.60 శాతం) ఓట్లను మాత్రమే పొందింది. ఒక్క అభ్యర్థికి కూడా డిపాజిట్‌ దక్కలేదు. ఏడుచోట్ల పోటీకి దిగిన సీపీఐ 5,816 (0.56శాతం) ఓట్లు సాధించి à°’à°• వార్డుని గెలుచుకుంది. 16 చోట్ల పోటీ చేసిన సీపీఎం 5,384 (0.52) ఓట్లతో à°’à°• వార్డులో విజయం సాధించింది. స్వతంత్రులుగా పోటీకి దిగిన అభ్యర్థులకు 51,638 (5.03 శాతం) ఓట్లు లభించాయి. వీరిలో నలుగురు గెలుపొందారు.