గవర్నర్‌కు రాసిన లేఖలు అంతర్గతం

Published: Sunday March 21, 2021

రాష్ట్ర గవర్నర్‌కు తాను రాసిన లేఖల్లోని వివరాలు బహిర్గతం(లీక్‌) కావడంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ జరిపించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. à°ˆ వ్యవహారంపై 72 గంటల్లో మధ్యంతర నివేదిక అందించేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. లేఖల్లోని సమాచారం ‘లీక్‌’ కావడంపై గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి విచారణ జరిపించడంలో విఫలమవడాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరారు. వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌, గవర్నర్‌ ముఖ్యకార్యదర్శితో పాటు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు.

 

à°ˆ వ్యాజ్యం శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రఘనందనరావు వద్దకు విచారణకు వచ్చింది. పిటిషనర్‌ వ్యక్తిగతంగా తనకు తెలిసినందున వ్యాజ్యాన్ని వేరే న్యాయమూర్తి వద్దకు బదిలీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి వద్ద తగిన సూచనలు తీసుకొని పిటిషన్‌ మరో న్యాయమూర్తి వద్దకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, ఎస్‌ఈసీ తన పిటిషన్‌లో ఏం పేర్కొన్నారంటే....

 

గవర్నర్‌ కార్యదర్శి విఫలం

రాజ్యాంగంలోని అధికరణ 243(కె)(3) మేరకు ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు వీలుగా గవర్నర్‌ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సదుపాయాలు కల్పించాలి. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో సమస్య పరిష్కారానికి పలుమార్లు గవర్నర్‌ను కలిసి లేఖలు అందజేశాను. à°† లేఖలు రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య జరిగే ప్రత్యేక ఉత్తరప్రత్యుత్తరాలు. అవి ప్రజా వినియోగానికి సంబంధించినవి కావు. à°† లేఖలు సాధారణ ప్రజానీకానికి, మీడియాకు బహిర్గతం చేయడానికి వీల్లేదు. కొందరు వ్యక్తులు తమ స్వార్ధ ప్రయోజనం కోసం à°† లేఖలను బహిర్గతం చేస్తూనే ఉన్నారు.

 

లేఖలు లీక్‌ కావడంపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్‌ ముఖ్యకార్యదర్శులకు పలుమార్లు విజ్ఞప్తి చేశా. చర్యలు తీసుకోవడంలో గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి విఫలమయ్యారు. ‘లేఖలు లీక్‌ చేశానని నన్నే ఇరికించే శక్తి సామర్థ్యాలు వారికి à°‰ న్నాయి. నా కార్యాలయం సిబ్బందికి కూడా à°† లేఖల గురించి తెలియదు. అవి పూర్తిగా నా ఆధీనంలో ఉన్నాయి. నా వైపు నుంచి లీక్‌ కావడానికి అవకాశమే లేదు’’ అని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఏపీ శాసన సభ కార్యదర్శి నుంచి à°ˆ నెల 18à°¨ à°’à°• లేఖ అందింది. నాకు, గవర్నర్‌కు మధ్య జరిగిన à°“ లేఖ విషయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని, ఆలేఖలను విస్తృతంగా ప్రచురించడంతోపాటు సామాజిక మాధ్యమాలలో సైతం ఉందని పేర్కొన్నారు. లీకుల కారణంగా తమ ప్రతిష్ఠకు à°­à°‚à°—à°‚ కలిగిందని ఇద్దరు మంత్రులు స్పీకర్‌కు లేఖలు రాశారని అందులో పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ తన వివరణ ఇవ్వాలని నోటీసు పంపించిందని పేర్కొందన్నారు. పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మెట్టు రామిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. à°ˆ నెల 12à°¨ నేను గవర్నర్‌కు రాసిన లేఖను అందులో పొందుపర్చారు. à°† లేఖ ఎక్కడ నుంచి పొందారో వ్యాజ్యంలో పేర్కొనలేదు.