ఆంకర్ ప్రదీప్ ఇంటికి పొలిసులు

Published: Wednesday January 03, 2018

తన వాక్య చాతుర్యంతొ అందరిని మెప్పించె తెలుగు యాంకర్, టీవీ హోస్ట్ ప్రదీప్ డిసెంబర్ 31à°µ తేదీ రాత్రి అతిగా మధ్యం సేవించి కారు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ అయిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు కారు కూడా సీజ్ చేశారు. కౌన్సిలింగుకు రావాల్సిందిగా అదేశించిన  ప్రదీప్ హాజరు కాలేదు.

మంగళవారమే ప్రదీప్ కౌన్సిలింగుకు హాజరు అవ్వాల్సింది మంగళవారమే అయినా.... బుధవారం ఉదయం 11 గంటల వరకూ హాజరు కాలేదని బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ బలవంతయ్య చెప్పారు . ప్రదీప్ కోసం ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను కూడా ఇంటికి పంపించామని తెలిపారు.

 à°ªà±à°°à°¦à±€à°ªà±‌కు శనివారం వరకూ కౌన్సెలింగ్ కు హాజరయ్యేందుకు అవకాశం ఉందని, అయితే తాము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరికిన వారికి రెండు రోజుల్లోపే కౌన్సెలింగ్ ను పూర్తి చేస్తున్నామని, బుధవారం ప్రదీప్ కౌన్సెలింగ్ కు హాజరు కాకుంటే, చార్జ్ షీట్ రిపోర్టులో à°ˆ విషయాన్ని కూడా చేరుస్తామని పోలీసులు తెలిపారు.