ఏపీలో మళ్లీ ఎన్నికల హడావుడి

Published: Tuesday March 23, 2021

ఏపీలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. పంచాయతీ, మున్సిపల్, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. à°ˆ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అలాగే à°ˆ నెల 31à°¨ పరిశీలిస్తారు. ఏప్రిల్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉంది. ఏప్రిల్ 17à°¨ పోలింగ్ కాగా, మే 2à°¨ ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా తిరుపతి ఉప ఎన్నికకు వైసీపీ నుంచి ప్రముఖ వైద్యుడు డాక్టర్ గురుమూర్తి పేరును ఖరారు చేశారు. టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి బరిలోకి దిగుతున్నారు. అలాగే బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించనున్నారు. 

 

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. à°ˆ ఉపఎన్నికకు సంబంధించిన తేదీలను వెల్లడిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె. విజయానంద్ విడుదల చేశారు.