ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు

Published: Thursday March 25, 2021

 à°“ర్వకల్లు ఎయిర్ పోర్టును జాతికి అంకితం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. న్యాయ రాజధానికి రాకపోకలు సాగేలా à°ˆ ఎయిర్ పోర్టు ఉపయోగపడుతుందంటూ పరోక్షంగా రాజధాని తరలింపుపై జగన్ సంకేతాలిచ్చారు. పనిలో పనిగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

 

రాష్ట్రంలో ఇది ఆరవ విమానాశ్రయమని, న్యాయ రాజధాని నుంచి మిగతా రాష్ట్రాలకు ఓర్వకల్లు విమానాశ్రయం కలుపుతుందని సీఎం జగన్ అన్నారు. ఎన్నికలకు నెల రోజుల ముందు.. ఎలక్షన్‌లో లబ్ది పొందేందుకు చంద్రబాబు ఓర్వకల్లు ఏయిర్ పోర్టును ప్రారంభించారని విమర్శించారు. రూ.110 కోట్లతో అన్ని హంగులతో ఎయిర్ పోర్టును తీర్చిదిద్దామన్నారు. ఓర్వకల్లు ఏయిర్ పోర్టుకు తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పేరును నామకరణం చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.