అన్‌ క్లెయిమ్‌డ్‌ పార్శిల్స్‌ వేలంలో ఆర్టీసీకి రూ.1.49 లక్షల ఆదాయం

Published: Saturday March 27, 2021

అంతా స్ర్కాప్‌ మెటీరియల్‌! అయినప్పటికీ ఆర్టీసీకి మంచి ఆదాయమే వచ్చింది! పీఎన్‌బీఎస్‌లో శుక్రవారం ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం నిర్వహించిన అన్‌ క్లెయిమ్‌డ్‌ పార్శిల్స్‌ ఆక్షన్‌లో ఆర్టీసీకి రూ.1,49,300à°² ఆదాయం వచ్చింది. మొత్తం 300 పార్శిల్స్‌లో 281 పార్శిల్స్‌కు వేలం వేయగా మిగిలిన 19 పార్శిల్స్‌ కాలం తీరిన మెటీరియల్‌ ఉండటంతో మినహాయించారు. వేలంను ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం అకౌంట్స్‌ ఆఫీసర్‌ పవన్‌, సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌ దేవందర్‌, అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ అనగాని వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్వహించారు. అన్‌ క్లెయిమ్‌డ్‌ పార్శిల్స్‌లో à°ˆ దఫా ఎలాంటి విలువైన, కొత్త వస్తువులు లేవు. పాత, డ్యామేజీ వస్తువులు మాత్రమే ఉన్నాయి. ఎక్కువగా ఆటోమొబైల్‌ రంగానికి సంబంధించిన పార్శిల్స్‌, మెడికల్స్‌కు సంబంధించిన పార్శిల్స్‌ మాత్రమే ఉన్నాయి. మిగిలినవన్నీ పనికిరానివే ఉన్నాయి.

 

మెడికల్‌ పార్శిల్స్‌లో ఎక్కువగా శానిటైజర్లు, మాస్కులు, థర్మామీటర్స్‌, పల్స్‌ ఆక్సీమీటర్స్‌ ఉన్నాయి. వీటిని వేలం వేయగా అత్యధికంగా రూ.70వేల వరకు పాట వెళ్లింది. ఆటోమైబల్‌ స్పేర్స్‌, ఎలక్ర్టికల్‌ పరికరాలకు సంబంధించి నిర్వహించిన వేలం గరిష్టంగా రూ.50వేలు ధర పలికింది. పాత బట్టలు, టీషర్టులు, చెప్పులు, రిపేర్‌కు వచ్చిన కంప్యూటర్‌ పరికరాలు, ఎలక్ర్టికల్‌ బోర్డులకు స్వల్పంగా ఆదాయం వచ్చిది. వేలంలో పోటీ పడేం