జీవీఎంసీ ప్రతిపాదనలు.... వీఎంఆర్‌డీఏ నిధులు

Published: Tuesday April 20, 2021

విశాఖపట్నంలో మకాం పెట్టి.. అధికార పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యతలు చూస్తున్న à°“ నాయకుడు.. తాను ఉంటున్న ఇంటి నుంచి భీమిలి బీచ్‌రోడ్డులో పార్టీ వ్యవహారాలు నిర్వహించే గెస్ట్‌హౌ్‌సకు వెళ్లి రావడానికి సౌకర్యంగా ఉండేలా à°“ రహదారి వేయించుకున్నారు. దాని వ్యయం అక్షరాలా రూ.7.5 కోట్లు. మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ప్రతిపాదనలు రూపొందిస్తే.. వీఎంఆర్‌డీఏ నిధులు వెచ్చించి నాలుగే నాలుగు నెలల్లో పనులు పూర్తిచేసింది. వైసీపీ నాయకుడు గతంలో సీతమ్మధారలో ఉండేవారు. అక్కడి నుంచి ఎండాడలోని శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ పనోరమ హిల్స్‌లోకి మకాం మార్చారు. అదంతా గేటెడ్‌ కమ్యూనిటీ. ముందుగా అపాయింట్‌మెంట్‌ ఉంటే తప్ప లోపలకు ఎవరినీ పంపరు.  దీనిపై నిరసనలు వ్యక్తం కావడంతో సదరు నేత రుషికొండ సమీపాన తిమ్మాపురంలో à°“ గెస్ట్‌హౌ్‌సను స్థావరంగా మార్చుకున్నారు. అక్కడి నుంచే పార్టీ వ్యవహారాలు నడుపుతున్నారు. జీవీఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశాలన్నీ అక్కడే నిర్వహించారు. à°ˆ నేపథ్యంలో పనోరమ హిల్స్‌ నుంచి రుషికొండ ఐటీ పార్కు మీదుగా తిమ్మాపురం వెళ్లడానికి జీవీఎంసీ 1.1 à°•à°¿.మీ. పొడవున à°“ రహదారిని ప్రతిపాదించింది. 

 

వీఎంఆర్‌డీఏ.. వుడాగా ఉన్నప్పుడు తారకరామ లేఅవుట్‌లో భాగంగా అక్కడ 40 అడుగుల రహదారిని నిర్మించింది. à°† రహదారినే ఇప్పుడు 80 అడుగుల వెడల్పున డబుల్‌ రోడ్డు నిర్మించాలని జీవీఎంసీ సూచించింది. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు కావడంతో వీఎంఆర్‌డీఏ బాధ్యత తీసుకుంది. à°—à°¤ నవంబరులో ప్రారంభించి ఫిబ్రవరికల్లా.. నాలుగు నెలల్లో పూర్తిచేసేసింది. à°ˆ రహదారి మధ్యలో కొన్ని ప్రైవేటు స్థలాలు ఉన్నాయి. వారికి ప్రత్యామ్నాయంగా ట్రాన్ఫరబుల్‌ డెవ లప్‌మెంట్‌ రైట్స్‌(టీడీఆర్‌) బాండ్లు ఇవ్వాల్సి ఉం ది. వారిలో ముగ్గురికి బాండ్లు అందలేదు. దాం తో వారు తమ ప్రాంతంలో రహదారి నిర్మాణా న్ని అడ్డుకున్నారు. కంచె వేశారు. అయినా అధికారులు వెనక్కి తగ్గలేదు. à°† బిట్‌ వదిలేసి మిగిలిన రహదారి పూర్తిచేశారు. అయ్యవారు à°† మార్గంలోనే కాన్వాయ్‌తో రయ్‌మంటూ తిరుగుతున్నారు. వీఎంఆర్‌డీఏ గతంలో అనేక రహదారులు నిర్మించింది. ఏళ్ల తరబడి పనులు సా..గదీస్తూ వచ్చినవి ఎన్నో. కానీ వీఎంఆర్‌డీఏ చరిత్రలో ఇన్ని కోట్లు పెట్టి.. కేవలం 4 నెలల్లో పూర్తిచేసిన రహదారి ఇదే కావడం విశేషం.