గన్నవరంలో 23, ఉంగుటూరులో 20 టన్నుల ఆక్సిజన్‌

Published: Wednesday April 28, 2021

 à°•à±ƒà°·à±à°£à°¾à°œà°¿à°²à±à°²à°¾ గన్నవరం మండలం సూరంపల్లి నుంచి తెలంగాణ తరలిపోతున్న ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టుకున్నారు. క్యూమెన్‌ ఎయిర్‌ ప్రొడక్ట్స్‌ ఏజెన్సీ తెలుగు రాష్ర్టాలకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తుంది. మంగళవారం 23 టన్నుల ద్రవ ఆక్సిజన్‌ ఉన్న లారీ సూరంపల్లి ఏజెన్సీకి వచ్చింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఆస్పత్రులకు రవాణా చేసేందుకు à°† లారీ సిద్ధంగా ఉందని అధికారులకు సమాచారం అందింది. గన్నవరం పోలీసుల సహకారంతో ఇన్‌చార్జి తహసీల్దారు వనజాక్షి, సీఐ కె.శివాజీ సిబ్బందితో వచ్చి కంపెనీ యజమానితో చర్చలు జరిపారు. 13టన్నులు ఇవ్వడానికి వారు అంగీకరించడంతో విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఏడు కొవిడ్‌ ఆస్పత్రులకు పోలీసు బందోబస్తు మధ్య తరలించారు. కాగా, పశ్చిమబెంగాల్‌ నుంచి గుంటూరు వైపు అనధికారికంగా 20టన్నుల ద్రవ ఆక్సిజన్‌ను తరలిస్తున్న ట్యాంకర్‌ను పొట్టిపాడు టోల్‌గేట్‌ వద్ద గన్నవరం సీఐ కె.శివాజీ, ఆత్కూరు ఎస్సై జి.శ్రీనివాసరావు నేతృత్వంలోని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. డ్రైవర్‌ ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో చినవుటపల్లిలోని పిన్నమనేని ఐసోలేషన్‌ సెంటరుకు తరలించారు. అక్కడ 6 టన్నుల ఆక్సిజన్‌ను అన్‌లోడ్‌ చేసి, మిగిలిన 14టన్నులు ఎస్కార్ట్‌తో గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి పంపారు.