యాజమాన్య హక్కులు ఏపీ డెయిరీకి బదలాయింపు

Published: Wednesday April 28, 2021

దక్షిణ భారతదేశంలోనే ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరొందిన గుంటూరు జిల్లా సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి రాష్ట్రప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో భాగంగా డెయిరీ యాజమాన్య హక్కులను ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు బదలాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా డెయిరీలో రోజు వారీ కార్యకలాపాల బాధ్యతలను తెనాలి సబ్‌కలెక్టర్‌కు అప్పగిస్తూ జీవో 19ని జారీ చేసింది.  డెయిరీలో రోజు వారీ కార్యకలాపాలకు వ్యక్తులెవరైనా అడ్డుపడితే చర్య తీసుకునే అధికారం సబ్‌కలెక్టర్‌కు ఇచ్చింది. డెయిరీ పాల సేకరణ, ప్రొసెసింగ్‌, మార్కెటింగ్‌తో సహా అన్ని అనుబంధ కార్యకలాపాలు ఆయన పర్యవేక్షణలో సాగుతాయని పేర్కొంది. ఉద్యోగులు, సిబ్బంది సహా à°ˆ డెయిరీతో సంబంధం ఉన్న వ్యక్తుల వల్ల యూనిట్‌లో రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడితే.. తగిన చర్యలు తీసుకోవడానికి సబ్‌కలెక్టర్‌కు అధికారం ఉంటుందని స్పష్టం చేసింది.

à°ˆ విధానం మూడు నెలల పాటు.. అంటే తదుపరి సమీక్ష నిర్వహించే వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఉత్తర్వులు రాగానే సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ సంగం డెయిరీకి చేరుకుని దానిని తన అధీనంలోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు విషయంలో à°—à°¤ ఐదు రోజులుగా ఆధారాల కోసం సోదాలు నిర్వహిస్తుండగానే రాష్ట్ర ప్రభుత్వం à°ˆ కీలక పరిణామానానికి తెరలేపింది. ఏసీబీ కేసుల విచారణ, సోదాల జరుగుతున్న నేపథ్యంలో నిత్యావసర వస్తువుల విభాగంలో ఉన్న సంగం డెయిరీలో రోజు వారీ కార్యకలాపాలకు ఏసీబీ సోదాలు ఆడ్డువస్తున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ద్వారా à°ˆ జీవో జారీ చేయించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాల ఉత్పత్తి కంపెనీగా ఉన్న సంగం డెయిరీపై ఎటువంటి చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేకపోవడంతో సంగం కో ఆపరేటీవ్‌ యూనియన్‌ పేరుతో జీవో విడుదల చేసి దానిని హస్తగతం చేసుకునేందుకు కుయుక్తులు పన్నిందని సంగం ఉద్యోగులు, పాల రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంగం డెయిరీని అమూల్‌కు హస్తగతం చేసే కుట్రలో భాగమే à°ˆ ఉత్తర్వులు జారీచేసిందని మండిపడుతున్నారు. మీడియాను సైతం సంగం డెయిరీలోకి అనుమతించకుండా అడ్డుకోవడం గమనార్హం. 

ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ ఫెడరేషన్‌ ప్రారంభించిన సంగం డెయిరీ నిర్వహణను 1978లో 515 జీవో ద్వారా గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం తీసుకుంది. పాల ఉత్పత్తి కార్యకలాపాలను పెంచేందుకు దాణా మిశ్రమ కర్మాగారం, సిబ్బంది వసతి గృహాలను కూడా నిర్మించారు. అయితే తర్వాత సంగం డెయిరీని సహకార చట్టం నుంచి కంపెనీల చట్టం కిందకు మార్పు చేశారు. కానీ యాజమాన్య హక్కులు మాత్రం డెయిరీ ఫెడరేషన్‌కే ఉండిపోయాయి. ఇదిలా ఉండగా, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ సంగం డెయిరీ చైర్మన్‌ అయ్యాక తన తండ్రి పేరిట à°“ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి, పాలకవర్గ తీర్మానంతో డెయిరీ భూమి 10ఎకరాలను ట్రస్ట్‌కు బదలాయించారని.

à°† భూమిని నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డుకు మార్ట్‌గేజ్‌ చేసి, రుణాలు తీసుకుని, అవకతవకలకు పాల్పడ్డారని సహకారశాఖ కమిషనర్‌ గతేడాది సెప్టెంబరులో ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. à°† అభియోగాలపై ప్రభుత్వం ఏసీబీతో విచారణ జరిపించింది. సంగం డెయిరీ ఆస్తులపై యాజమాన్య హక్కులు ఏపీ డెయిరీకి ఉండగా.. ఎన్‌డీడీబీకి సంగం డెయిరీ భూమిని తాకట్టు పెట్టి, రుణాలు తీసుకోవడం సహకార చట్టానికి విరుద్ధమని ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనికి బాధ్యులంటూ చైర్మన్‌ నరేంద్రకుమార్‌ను, à°Žà°‚à°¡à±€ గోపాలకృష్ణన్‌ను అరెస్టు చేసింది. చైర్మన్‌పై అభియోగాల సాకుతో సంగం డెయిరీని స్వాధీనం చేసుకునే చర్యలను ప్రభుత్వం చేపట్టింది.