విశాఖ డెయిరీలో జరుగుతున్న అక్రమాలు

Published: Thursday April 29, 2021

అక్రమాలు జరుగుతున్నాయంటూ గుంటూరు జిల్లా సంగం డెయిరీని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. విశాఖ డెయిరీలో జరుగుతున్న అక్రమాలపై మాత్రం దృష్టిపెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. విచారణ జరిపితే అనేక బాగోతాలు బయటపడతాయని అంటున్నారు. విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో నడుపుతున్న బినామీ డెయిరీకి విశాఖ నుంచి రోజూ 30 వేల లీటర్ల పాలు సరఫరా చేస్తున్నారు. ఇక్కడ à°ˆ డెయిరీ పాలను లీటరు రూ.56à°•à°¿ విక్రయిస్తుండగా.. హైదరాబాద్‌ డెయిరీకి మాత్రం అందులో సగం ధరకే ఇస్తున్నారు. à°ˆ పాలను కూడా ‘నాయుడు’ అనే బినామీ వ్యక్తితో కొనిపించి.. జేబీఆర్‌ అనే రవాణా సంస్థ ద్వారా పంపుతున్నారు. మధ్యలో వీటికి సమన్వయకర్తగా శ్రీరామాంజనేయ ఏజెన్సీ అనేది ఇంకోటి ఉంది. à°’à°• డెయిరీ నుంచి ఇంకో డెయిరీ పాలు తీసుకునేటపుడు మధ్యలో ఇన్ని సంస్థలు ఎందుకున్నాయి.. వాటి వెనుక ఎవరు ఉన్నారో ఆరా తీస్తే.. ఆడారి వ్యవహారాలన్నీ బయటపడతాయని పాల రైతులే చెబుతున్నారు. డెయిరీ వైస్‌ చైర్మన్‌ బంధువుతో ‘బర్ఫానీ’ పేరుతో మరో సంస్థను ఏర్పాటుచేసి, దాని ద్వారా మరికొన్ని కార్యకలాపాలు నడుపుతున్నారు. బినామీ ‘నాయుడు’ పేరుతో ఎల్‌ఐసీ ఏజెన్సీ తీసుకుని.. పాల రైతులకు బీమాలు కట్టించి.. వాటి ప్రీమియంలు డెయిరీ దగ్గరే మినహాయించుకుని లక్షల రూపాయలు కమీషన్‌ రూపంలో తీసుకుంటున్నారని.. కొందరికి క్లెయిమ్‌లు కూడా అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. విశాఖ డెయిరీ ఉద్యోగులకు సొంత ఇళ్లు సమకూరుస్తామని కో-ఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీ పెట్టి.. షీలానగర్‌లో 3.2 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో 240 ఫ్లాట్లతో అపార్ట్‌మెంట్ల నిర్మాణం చేపట్టారు. అందులో మూడో వంతు మాత్రమే ఉద్యోగులకు ఇచ్చారని, వీటిపై విచారణ చేయాలని చాలాకాలంగా సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

డెయిరీ ట్రస్టు పేరుతో ఎలమంచిలిలో ఇంజనీరింగ్‌ కాలేజీ పెడతామని 18 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దానిని ట్రస్టు పేరుతో కాకుండా ఆడారి కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్టర్‌ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దానిపై విచారణ చేయాలని, ఇప్పుడు à°† భూముల విలువ రూ.40 కోట్లపైనే ఉంటుందని à°“ కరపత్రం కూడా విడుదలైంది.

రైతులకు తక్కువ వ్యయంతో వైద్యం అందిస్తామని ‘కృషి’ పేరుతో షీలానగర్‌లో 430 పడకల ఆస్పత్రి నిర్మించారు. కొద్దికాలం క్రితమే అందులో 51 శాతం వాటాను కిమ్స్‌à°•à°¿ అమ్మేశారు. à°† డీల్‌ à°Žà°‚à°¤.. అందులో ట్రస్టుకు à°Žà°‚à°¤ జమ చేశారు.. ఆడారి కుటుంబ సభ్యులకు à°Žà°‚à°¤ దక్కిందనేది ఇప్పటికీ మిస్టరీనే. అయితే వైద్యసేవల కోసం డెయిరీ నుంచి నెలకు రూ.75 లక్షలు కిమ్స్‌ ఆస్పత్రికి ఇస్తున్నారని, రైతులకు ఆరోగ్యశ్రీ ఉండగా, మళ్లీ à°ˆ మొత్తం ఎందుకు చెల్లిస్తున్నారని పాలరైతులు ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటిపైనా ప్రభుత్వం విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు.​