విద్యార్థులకు మంచి చేయాలనే పరీక్షలు

Published: Saturday May 01, 2021

: à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°² భవిష్యత్‌ కోసమే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు-నేడు సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘ఏ పరిస్థితిలో ఎందుకు పరీక్షలు పెడుతున్నామో చెప్పాలి. నిన్న కేరళలో 10à°µ తరగతి పరీక్షలు పూర్తి చేశారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలపై కేంద్రం ఏ విధానాన్ని ప్రకటించలేదు.. నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది.. రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా.. మరికొన్ని రద్దు చేశాయి. పరీక్ష పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్‌ మార్కులు మాత్రమే ఇస్తున్నాయి. అలాంటప్పుడు మంచి కాలేజీల్లో వారికి సీట్లు ఎలా వస్తాయి..? పరీక్షలు జరిగితే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి.. 70 శాతానికి పైగా మార్కులు వస్తే సీట్లు వారికే వస్తాయి కదా! కేవలం పాస్‌ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్‌ ఏమిటి? విద్యార్థులకు మంచి చేయాలన్న తపనతోనే à°ˆ నిర్ణయం తీసుకున్నాం. నిజానికి పరీక్షలు రద్దు చేయడం చాలా సులభం. నిర్వహణ ఇంకా బాధ్యతతో కూడుకున్నది’ అని వ్యాఖ్యానించారు.. విద్యార్థుల మంచి భవిష్యత్‌  కోసమే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్న విషయాన్ని ప్రతి టీచరూ గుర్తించాలన్నారు. ఇందులో అందరి సహాయ సహకారాలు, తోడ్పాటు కావాలన్న విషయాన్ని వారందరికీ బలంగా చెప్పాలని అధికారులకు సూచించారు. ‘పరీక్షల కోసం అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.. ఎక్కడా ఏ మాత్రం అలక్ష్యం చూపొద్దు..’ అని నిర్దేశించారు.