కరోనా నేపథ్యంలో ఆరోగ్యానికి ప్రాధాన్యం

Published: Sunday May 02, 2021

రేషన్‌ పంపిణీ బాధ్యతను డోర్‌ డెలివరీ వాహనాలకు ఇచ్చినందున à°ˆ నెలలో ఎవరికీ సరుకులు పంపిణీ చేయరాదని డీలర్లు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కొన్ని ప్రాంతాల్లో డోర్‌ డెలివరీ చేస్తున్నా... చాలా చోట్ల ఇంకా డీలర్లే పంపిణీ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో à°ˆ నెలలో డీలర్లు పంపిణీ జోలికి వెళ్లకూడదని యోచిస్తున్నారు. దీనిపై డీలర్లలో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. పంపిణీ చేపట్టకూడదని, ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమివ్వాలని ఎస్‌ఎంఎ్‌సలు, వాట్సాప్‌ సందేశాలు పంపుతున్నారు. దీంతో ఈసారి రేషన్‌ పంపిణీ భారం ఎక్కువగా వాహనాలపైనే పడే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి డోర్‌ డెలివరీ ప్రారంభించాక డీలర్లు నామమాత్రంగా మారారు. వారి నుంచి పంపిణీ బాధ్యతను పూర్తిగా తొలగించారు. కాగా చాలా చోట్ల వాహనాల ఆపరేటర్లు పంపిణీ భారం డీలర్లకే వదిలేస్తున్నారు. సగం కార్డులకు సరుకులు ఇచ్చి మిగతా సగం డీలర్లకు వదిలేయడం లేదా పూర్తిగా వారిపైనే భారం వేయడం చేస్తున్నారు. 

 

à°ˆ విషయంలో ఆపరేటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదని, తక్కువ వేతనానికి హమాలీలు దొరకడం లేదని కారణాలు చెబుతున్నారు. డోర్‌ డెలివరీ ద్వారా పూర్తిగా పంపిణీ చేయడం లేదు. à°“ గ్రామంలో తొలుత కొన్ని కార్డులకు డోర్‌ డెలివరీ చేసి ఆపేసి, మిగిలిన కార్డులకు ఇచ్చే బాధ్యతను డీలర్లకు అప్పగించి, పక్క ఊర్లలో పంపిణీకి వెళ్లిపోతున్నారు. దీంతో కార్డుదారులు రేషన్‌ షాపుల చుట్టూ తిరగడం... అధికారుల ఒత్తిడి భరించలేక డీలర్లే మిగతా పంపిణీని పూర్తిచేస్తున్నారు. à°—à°¤ నెల వరకూ పంపిణీ చేసినా, à°ˆ నెలలో కరోనా తీవ్రరూపం దాల్చడంతో డీలర్లు బెంబేలెత్తిపోతున్నారు. పైగా డీలర్లకు ప్రభుత్వం వ్యాక్సిన్‌ వేయించలేదు. దీంతో à°ˆ నెలలో ఒక్క కార్డుకు కూడా రేషన్‌ ఇవ్వకూడదని సంఘాలు, డీలర్లు గట్టిగా పట్టుబడుతున్నారు. కాగా డీలర్లు పంపిణీ చేయరాదంటూ ఉన్నతాధికారులు గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. వాహనాలతోనే వంద శాతం పంపిణీ చేయాలంటే నెలంతా ఇచ్చినా పూర్తికాదని, డీలర్లు కొంత పంపిణీ చేయక తప్పదని స్థానిక అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి పంపిణీ చేపట్టకూడదని డీలర్లు యోచిస్తున్నారు.