24గంటల్లో నా దగ్గరికి వచ్చి వివరణ ఇవ్వాలి....

Published: Tuesday June 12, 2018

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఈనెల చివరి నాటికి పూర్తిచేయాలని, లేదంటే సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో సోమవారం సంబంధితఅధికారులతో సమీక్షా సమా వేశం నిర్వహించారు. à°ˆ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో మిషన్‌ భగీరథ పనులు ఆలస్యం అవుతున్నాయని, సదరు కాంట్రాక్టర్‌ 24గంటల్లో తన వద్దకు వచ్చి వివరణ ఇవ్వాలని అన్నారు. పనులు త్వరగా పూర్తిచేయడానికి కూలీలను పెంచుకోవాలని సూచించారు. పనులు ఆలస్యం అయితే కాంట్రాక్టరే కాకుండా సంబంధిత ఇంజనీర్‌ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. à°ˆ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.