కీలకమైన సమయంలో సర్కారు ‘సైలెన్స్‌’!

Published: Wednesday May 12, 2021

వ్యాక్సిన్‌ ప్లీజ్‌... రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే మాట! వ్యాక్సిన్‌ కేంద్రాల చుట్టూ జనం తిరిగి తిరిగి విసిగిపోతున్నారు. ఫస్ట్‌ డోస్‌ సంగతి పక్కనపెడితే... కాలం మీరిపోతున్నా సెకండ్‌ డోస్‌ కూడా దొరక్క లక్షల మంది ఆందోళన చెందుతున్నారు. అయితే.. à°ˆ పరిస్థితికి కేంద్రమే కారణమని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది. ‘కొనడానికి మేం రెడీ! కానీ, వ్యాక్సిన్‌ పంపిణీ మొత్తం కేంద్రం చేతిలోనే ఉంది’ అంటోంది. à°ˆ మాట à°Žà°‚à°¤ నిజమో.. నేరుగా వ్యాక్సిన్‌ కంపెనీల నుంచి కొనేందుకు అవకాశం ఉన్నప్పుడు నిష్ర్కియాపరత్వం చూపించడం కూడా అంతే నిజం! కేంద్ర ప్రభుత్వం 18 నుంచి 45 మధ్య వయసు వారికి కూడా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రారంభించాలని ఏప్రిల్‌ 15à°µ తేదీన నిర్ణయించింది. దీనికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీంతోపాటు వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలతో సొంతంగా మాట్లాడుకోవాలని కూడా రాష్ట్రాలకు సూచించింది. ఏప్రిల్‌ 20 నుంచి 29à°µ తేదీ వరకూ వ్యాక్సిన్‌ కంపెనీలతో చర్చించుకుని, మే 1à°µ తేదీ నుంచి ‘టీకా ఉత్సవ్‌’ ప్రారంభించాలని కేంద్రం సూచించింది.

à°† వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేసింది. ఏపీలో 18 నుంచి 45 ఏళ్ల మధ్యలో వాళ్లు 1.04 కోట్లు మంది ఉంటారు. వారికి వ్యాక్సిన్‌ వేయాలంటే నాలుగు కోట్ల డోస్‌లు కావాలి. వెంటనే రూ.1600 కోట్లు పెట్టి వ్యాక్సిన్‌ కొనుగోలు చేసేస్తున్నామని రెండ్రోజులపాటు హల్‌చల్‌ చేశారు. ప్రెస్‌మీట్లు పెట్టి మరీ అదరగొట్టారు. ఆరోగ్యశాఖ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఇచ్చేస్తుందన్న ఉద్దేశంతో వ్యాక్సిన్‌ కంపెనీలతో చర్చలు జరిపారు. భారత్‌ బయోటెక్‌, సీరం సంస్థలు ఏపీకి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చాయి. కానీ.. డబ్బులు ముందుగానే ఇవ్వాలని కోరాయి. ఏపీ ప్రభుత్వం మాత్రం ‘à°† ఒక్కటి అడగొద్దు’ అంటూ ముఖం చాటేసింది. ‘అడ్వాన్స్‌ పేమెంట్‌’ అనగానే వ్యాక్సిన్‌ గురించి మారుమాట్లాడకుండా మౌనం పాటించింది. à°† సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డబ్బు చెల్లించి ఉంటే.. వ్యాక్సిన్‌ కంపెనీలు టీకాలు సరఫరా చేసేవి. à°ˆ రోజు పరిస్థితి వేరేలా ఉండేది. కానీ... ఏప్రిల్‌ 30à°µ తేదీన కేంద్రం బాంబుపేల్చింది. 18 నుంచి 45 ఏళ్ల వయసు వారికి అవసరమైన వ్యాక్సిన్‌కు సంబంధించిన కేటాయింపులు కూడా తానే చేస్తానంటూ మొత్తం నియంత్రణను తన చేతుల్లోకి తీసుకుంది.

 

వెరసి.. రాష్ట్రాలు కంపెనీలతో నేరుగా మాట్లాడుకుని, వ్యాక్సిన్‌ తెప్పించుకోవడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. ఏప్రిల్‌ 20 నుంచి 29 వరకు ఉన్న గడువును ఉపయోగించుకోకుండా, కంపెనీలకు అడ్వాన్స్‌ పేమెంట్లు చేయకుండా... ఇప్పుడు ‘మా చేతిలో ఏమీ లేదు. కేంద్రం ఇస్తే మేం వేస్తాం’ అని చేతులెత్తేసింది. కేంద్రం రాష్ట్రానికి కేవలం 13 లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లను కేటాయించి చేతులు దులుపుకొంది. ఇది ఏ మూలకూ సరిపోదని తెలిసినా, లేఖలు రాయడం తప్ప మరో మాట మాట్లాడటంలేదు.

‘à°ˆ సమయంలో ప్రధానిని ఎవవరూ ఏమీ అనొద్దు. ఆయనకు à°…à°‚à°¡à°—à°¾ నిలవాలి’.... ఇది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వైఖరి! ఇలాంటి పరిస్థితుల్లో... కేంద్రాన్ని à°…à°¡à°¿à°—à°¿, అవసరమైతే నిలదీసి, పోట్లాడి రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకుంటారనుకుంటే అంతకు మించిన అత్యాశ ఉండదు. వ్యాక్సిన్‌ కోటా కేటాయింపులో మౌనమే దీనికి నిదర్శనం. కొవిడ్‌ మొదటి దశలో దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తర్వాతి స్థానం ఏపీదే. పాజిటివిటీతో పాటు యాక్టివ్‌ కేసుల్లోనూ రెండో స్థానంలో ఉంది. కేంద్రం రాష్ట్ర జనాభాతోపాటు మొదటి దశలో నమోదైన కేసుల ప్రాతిపదికన వ్యాక్సిన్‌ కేటాయింపులు చేసింది. అందులో భాగంగా మహారాష్ట్రకు ఇప్పటి వరకూ కోటి 80 లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లను పంపించింది. మహారాష్ట్ర తర్వాత ఏపీకే అత్యధిక డోస్‌లు కేటాయించాలి. 

కానీ ఇప్పటికి 73.4 లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లను మాత్రమే మన రాష్ట్రానికి అందించింది. మనకంటే తక్కువ కేసులు నమోదైన గుజరాత్‌కు 1.40 కోట్లు, రాజస్థాన్‌కు 1.40 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందడం గమనార్హం. పశ్చిమ బెంగాల్‌కు కూడా 1.20 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను అందించింది. ఆయా రాష్ట్రాలు కేంద్రంపై ముందుగానే ఒత్తిడి తీసుకువచ్చి ఎక్కువ కేటాయింపులు జరిగేలా చూసుకున్నాయి. ఏపీ మాత్రం ‘చిత్తం ప్రభూ’ అంటూ కేంద్రం à°Žà°‚à°¤ ఇస్తే à°…à°‚à°¤ తీసుకోవడమే! రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రంతో సఖ్యతగా ఉంటే చాలన్నట్లుగా రాష్ట్రం వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. à°ˆ నేపథ్యంలో కేంద్రం కూడా ఏపీ పట్ల కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్రం కేటాయింపులు జరుపుతున్న సమయంలోనే ఒత్తిడి తీసుకొచ్చి ఉంటే... రాష్ట్రంలో కనీసం కోటి మందికి పైన మొదటి, రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ జరిగేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.