13 లక్షలు దాటేశాయ్‌

Published: Wednesday May 12, 2021

రాష్ట్రంలో కరోనా కేసులు 13 లక్షల మార్కుని దాటేశాయి. à°—à°¤ 24 గంటల్లో పాజిటివ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా మరణాలు మాత్రం తగ్గలేదు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 60,124 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 14,986 మందికి పాజిటివ్‌ వచ్చిందని, కరోనాతో 84 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 13,02,589à°•à°¿, మొత్తం మరణాల సంఖ్య 8,791à°•à°¿ చేరుకుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 2,352 మందికి వైరస్‌ సోకగా.. విశాఖపట్నంలో 1,618, గుంటూరులో 1,575, చిత్తూరులో 1,543, నెల్లూరులో 1,432, శ్రీకాకుళంలో 1,298, కడపలో 1,224, కర్నూలులో 948, కృష్ణాలో 666, ప్రకాశంలో 639, అనంతపురంలో 639, విజయగనరంలో 629, పశ్చిమగోదావరిలో 423 కేసులు నమోదయ్యాయి. ఒకరోజు వ్యవధిలో 16,167 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా.. రికవరీల సంఖ్య 11,04,431à°•à°¿ చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,89,367 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా కారణంగా పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో 12 మంది చొప్పున మరణించగా.. తూర్పుగోదావరిలో 10, విశాఖలో 9, నెల్లూరు, విజయనగరం 8 మంది చొప్పున, చిత్తూరు, కర్నూలులో ఆరుగురు చొప్పున, కృష్ణా, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున, అనంతపురంలో ముగ్గురు, కడపలో ఇద్దరు చొప్పున చనిపోయారు.