దేశంలోని 310 జిల్లాల్లో భారీగా పాజిటివిటీ రేటు

Published: Thursday May 13, 2021

దేశవ్యాప్తంగా కొవిడ్‌ పాజిటివిటీ రేటు (చేసిన టెస్టుల్లో పాజిటివ్‌à°² సంఖ్య) 20 నుంచి 21 శాతంగా ఉందని.. దేశంలోని 310 జిల్లాల్లో పాజిటివిటీ రేటు అంతకన్నా ఎక్కువగా ఉందని జాతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువ ఉండే జిల్లాల్లో 6 నుంచి 8 వారాలపాటు లాక్‌డౌన్‌ విధించాలని ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ సూచించారు. ‘ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలను షట్‌డౌన్‌ చేయాలి. పాజిటివిటీ రేటు 10 నుంచి 5 శాతానికి వచ్చాకే ఆంక్షలు తొలగించాలి. కానీ, అందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల కన్నా తక్కువ పట్టదు’’ అని ఆయన à°’à°• ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తొమ్మిది రాష్ట్రాల్లో 25% కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉందని ఆయన తెలిపారు. ఉదాహరణకు.. గోవాలో 49.6%, పుదుచ్చేరిలో 42.8%, పశ్చిమబెంగాల్‌లో 34.4%, హరియాణాలో 34.3%, కర్ణాటకలో 32.4% పాజిటివిటీ రేటు ఉంది. అలాగే.. 10 రాష్ట్రాల్లో 20 నుంచి 25% ఉన్నట్టు బలరామ్‌ భార్గవ వివరించారు.  భారత ప్రభుత్వం ఆయా రాష్ట్రాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా 500కు పైగా జిల్లాల్లో 10 శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉంది.

 

ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో సైతం పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువే ఉంది. ఢిల్లీనే తీసుకుంటే.. అక్కడ పాజిటివిటీ రేటు 35 శాతం నుంచి ప్రస్తుతం 17 శాతానికి తగ్గిందని... అలాంటిచోట లాక్‌డౌన్‌ ఎత్తేస్తే పెనుప్రమాదం సంభవిస్తుందని బలరామ్‌ భార్గవ హెచ్చరించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు విధించినప్పటికీ.. అవి ఎక్కడ ఎంతకాలంపాటు ఉండాలో సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు తెలపడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మోదీ సర్కారును ఆయన తప్పుపట్టలేదుగానీ.. à°ˆ సంక్షోభానికి స్పందించడంలో కొంత ఆలస్యమైందని అభిప్రాయపడ్డారు. ‘‘ఒకే à°’à°• అసంతృప్తి ఏంటంటే.. 10ు పాజిటివిటీ ఉన్న చోట లాక్‌డౌన్‌ విధించాలంటూ చేసిన సిఫారసును ఆమోదించడంలో కొంత ఆలస్యమైంది’’ అని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 15à°¨ ‘నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆన్‌ కొవిడ్‌-19’ భేటీలో ప్రభుత్వానికి à°ˆ సూచన చేసినట్టు బలరామ్‌ భార్గవ తెలిపారు.

 

కానీ.. లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగా మాత్రమే వాడాలని, సూక్ష్మ కట్టడి ప్రాంతాల ఏర్పాటుపైనే దృష్టి సారించాలని ప్రధాని మోదీ ఏప్రిల్‌ 20à°¨ టీవీలో జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో సూచించడం గమనార్హం. à°… తర్వాత ఆరు రోజులకు.. అంటే ఏప్రిల్‌ 26à°¨.. పెద్ద కట్టడి ప్రాంతాల్లో, కేసులు బాగా ఎక్కువ ఉన్న జిల్లాల్లో కరోనా కట్టడికి రెండువారాలపాటు à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు లేఖలు రాసింది. కాగా.. ఏప్రిల్‌ మొదట్లోనే దేశంలో à°•à° à°¿à°¨ లాక్‌డౌన్‌ ఆంక్షలను విధించాల్సిన అవసరం ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అధిపతి పేర్కొన్నట్టుగా చెబుతూ రాయ్‌టర్స్‌ వార్తాసంస్థ à°’à°• కథనాన్ని à°ˆ నెల మొదట్లో ప్రచురించింది. అంతేకాదు.. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభల్లో మాట్లాడడం, మతపరమైన కార్యక్రమాలకు అనుమతులివ్వడం తమను తీవ్ర నిరాశకు గురిచేశాయని ఐసీఎంఆర్‌కు చెందిన ఇద్దరు అధికారులు రాయ్‌టర్స్‌కు తెలిపారు. అయితే, ఐసీఎంఆర్‌లో దీనిపై అసంతృప్తి ఏమీ లేదని బలరామ్‌ భార్గవ స్పష్టం చేశారు. ఏ రాజకీయ నాయకుడి పేరూ ప్రత్యేకంగా ప్రస్తావించకుండా.. కొవిడ్‌ సమయంలో భారీ బహిరంగ సభలు మాత్రం ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు